Ola IPO: ఒలా ఐపీఓకు సెబీ ఆమోదం..
స్టాక్ మార్కెట్ లోకి మరో భారీ ఐపీఓ రానుంది. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు మార్గం సుగమం అయింది.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ. 7,250 కోట్ల విలువైన ఓలా ఎలక్ట్రిక్ ప్రతిపాదిత ను ఐపీఓ ఆమోదించింది. ప్రతిపాదిత ఐపీఓ కోసం ఒలా ఎలక్ట్రిక్ గత ఏడాది డిసెంబర్‌లో SEBIకి డ్రాఫ్ట్ అంటే DRHP దాఖలు చేసింది. ముసాయిదాలో ఐపీఓ తీసుకురావడం ద్వారా మార్కెట్ నుంచి రూ. 7,250 కోట్ల వరకు సమీకరించాలనేది తమ ప్రణాళిక అని కంపెనీ పేర్కొంది.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ముసాయిదా ప్రకారం రూ.5,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయాలని యోచిస్తోంది. ఇది కాకుండా కంపెనీ ప్రస్తుత పెట్టుబడిదారులు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా IPOలో రూ.1,750 కోట్ల విలువైన షేర్లను విక్రయించవచ్చు. ఈ విధంగా ఐపీఓ మొత్తం పరిమాణం రూ.7,250 కోట్లకు పెరగవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్‌లో 47.3 మిలియన్ షేర్లను విక్రయించవచ్చు. వీరితో పాటు, ఆల్ఫా వేవ్, ఆల్పైన్, డిఐజి ఇన్వెస్ట్‌మెంట్, మ్యాట్రిక్స్ మరియు కంపెనీ ప్రారంభ పెట్టుబడిదారులలో ఉన్న ఇతరులు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తమ 47.89 మిలియన్ షేర్లను విక్రయించవచ్చు.

ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తంలో రూ.1,226 కోట్లను క్యాపెక్స్‌పై, రూ.800 కోట్లు రుణ చెల్లింపులపై, రూ.1,600 కోట్లు ఆర్‌అండ్‌డీపై, రూ.350 కోట్లు అకర్బన వృద్ధికి ఖర్చు చేయనుంది. జూన్ 10న ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఈ ఏడాది తన IPOను ప్రారంభించబోతోందని అంతకు ముందు వార్తలు వచ్చాయి. ఇందుకోసం కంపెనీ కోటక్ మహీంద్రా క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది.


Click it and Unblock the Notifications