భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, మూడ్రోజుల్లో 1200 పాయింట్లు పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. పైగా అంతకంతకూ దిగజారాయి. మధ్యాహ్నం ఓ సమయంలో 700 పాయింట్ల మేర నష్టపోయింది. చివరకు అతి స్వల్పంగా కోలుకొని 435 పాయింట్ల నష్టంతో ముగిసింది. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి.
పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ దాదాపు ఐదు శాతం మేర పతనమైంది. ఆటో, బ్యాంకు, ఇన్ఫ్రా, మెటల్, ఫార్మా సూచీలు ఒక శాతం నుండి 2 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టపోయాయి. బడ్జెట్ అనంతరం మార్కెట్లు జంప్ చేశాయి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. దీంతో నష్టపోతున్నాయి. సెన్సెక్స్ నాలుగు రోజుల్లో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయింది.

సెన్సెక్స్ 435 పాయింట్ల నష్టం
సెన్సెక్స్ 434.93 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టపోయి 50,889.76 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 137.20 పాయింట్లు లేదా 0.91 శాతం నష్టపోయి 14,98.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1175 షేర్లు లాభాల్లో, 1727 షేర్లు నష్టాల్లో ముగియగా, 170 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ నేడు ఉదయం 51,238.02 వద్ద ప్రారంభమై, 51,432.99 వద్ద గరిష్టాన్ని, 50,624.33 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 600 పాయింట్ల మేర కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో 2.17 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.90 శాతం, గెయిల్ 1.61 శాతం, HUL 1.60 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.40 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 5.06 శాతం, టాటా స్టీల్ 3.88 శాతం, హీరో మోటో కార్ప్ 3.78 శాతం, ఎస్బీఐ 3.77 శాతం, టాటా మోటార్స్ 3.71 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా మోటార్స్, రిలయన్స్, ఇండస్ఇండి బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 0.59 శాతం లాభపడి రూ.2,080 వద్ద ముగిసింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.91 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.30 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఆటో 2.65 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.47 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.49 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.11 శాతం, నిఫ్టీ ఐటీ 0.45 శాతం, నిఫ్టీ మీడియా 0.86 శాతం, నిఫ్టీ మెటల్ 1.96 శాతం, నిఫ్టీ ఫార్మా 1.36 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4.76 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.30 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.55 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications