కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఫ్లాట్ కొంటున్నారా? ఇది తెలుసుకోకపోతే నష్టపోతారు!
మీరు కన్‌స్ట్రక్షన్ దశలో ఉన్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు కాపిటల్ గెయిన్ ట్యాక్స్ (Capital Gain Tax Exemption) లభిస్తుంది. కానీ, ఈ ప్రయోజనం పొందాలంటే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 (Section 54) నిబంధనలను తప్పక తెలుసుకోవాలి.

చాలా మంది పన్ను చెల్లింపుదారులకు (Taxpayers) ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఈ మినహాయింపు (tax Exemption) వర్తిస్తుందా? లేదా? అనే దానిపై పెద్ద ఆందోళన ఉంటుంది. దీనికి సంబంధించిన కీలకమైన నిబంధనలను, నిపుణుల సలహాలను ఇప్పుడు చూద్దాం.
సెక్షన్ 54 అంటే ఏమిటి? పన్ను మినహాయింపు ఎలా వస్తుంది?
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 కింద.. ఒక వ్యక్తి లేదా హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) నివాస గృహాన్ని అమ్మడం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను మినహాయింపు (tax Exemption) పొందవచ్చు. అయితే ఆ లాభాన్ని నిర్దేశించిన కాలపరిమితిలోగా మరో నివాస గృహాన్ని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి పెట్టుబడి పెట్టాలి.
రూల్ ఇదే..
అమ్మిన తేదీకి ఒక సంవత్సరం ముందు లేదా 2 సంవత్సరాల లోపు కొత్త నివాస గృహాన్ని కొనుగోలు చేయాలి. అలాగే కొత్త ఇల్లు నిర్మాణం 3 సంవత్సరాల లోపు అవ్వాలి. కన్‌స్ట్రక్షన్ లో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేవారు ఈ రూల్ ను తప్పక గుర్తుంచుకోవాలి. సెక్షన్ 54 యొక్క tax Exemption వర్తించాలంటే.. ఇంటి నిర్మాణం అనేది పాత ఇంటిని అమ్మిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తప్పనిసరిగా పూర్తి కావాలి. అంటే పాత ఇంటిని అమ్మడం, కొత్త ఇంటిని కొనడం మధ్య గ్యాప్ 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకూడదు.
డెవలపర్ ఆలస్యం చేస్తే పరిస్థితి ఏంటి?
కొన్నిసార్లు డెవలపర్ (Builder) ఆలస్యం చేస్తే నిర్మాణం 3 సంవత్సరాలు దాటిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో.. కొనుగోలుదారుడి వైపు ఎలాంటి లోపం లేకపోతే.. tax Exemption మినహాయింపు లభించేందుకు నిబంధనలు ఉన్నాయి. అంటే బిల్డర్.. ఒప్పందం ప్రకారం ఫ్లాట్‌ను సమయానికి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే.. మీకు 3 సంవత్సరాల తర్వాత కూడా పన్ను మినహాయింపు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. నిపుణుల సలహా ఏంటంటే.. కొత్త ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కాపిటల్ గెయిన్ మినహాయింపు పొందాలంటే పాత ఆస్తిని వ్యూహాత్మకంగా విక్రయించడం మంచిది.
ఇలా కూడా చేయొచ్చు
సరైన సమయంలో కొత్త ఇంటిని కొనుగోలు చేయడంలో లేదా నిర్మించడంలో విఫలమైతే.. పన్ను చెల్లింపుదారులు కాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపు కోల్పోకుండా ఉండటానికి ఒక ముఖ్యమైన పథకం ఉంది. అదే కాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ (CGAS). ఇది ఆదాయ పన్ను చట్టం కింద ఉన్న ఒక ప్రత్యేక సదుపాయం. ఒక దీర్ఘకాలిక కాపిటల్ ఆస్తిని (ఇల్లు, భూమి వంటివి) అమ్మడం ద్వారా వచ్చిన లాభాన్ని వెంటనే మళ్లీ పెట్టుబడి పెట్టలేకపోతే ఆ కాపిటల్ గెయిన్ మొత్తాన్ని CGAS ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని తర్వాత కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలా కూడా చేయలేకపోతే మీకు పన్ను రాయితీ వర్తించదు.


Click it and Unblock the Notifications