Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వస్తున్న మార్పులు ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పుట్టుకతో పౌరసత్వం రద్దు నుంచి మిలిటరీ విమానాల్లో డిపోర్టేషన్ వరకు అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ప్రస్తుతం పెద్ద ఊరటను కలిగిస్తున్న మరో విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో బుధవారం నాడు మరో ఫెడరల్ జడ్జి కూడా ట్రంప్ తీసుకొచ్చిన జన్మతః పౌరసత్వ రద్దు బిల్లుకు బ్రేక్ వేశారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా ఆయన పేర్కొన్నారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని అక్కడి జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ పేర్కొన్నారు. పౌరసత్వం అనేది రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా స్పష్టంగా మంజూరు చేయబడిన అత్యంత విలువైన హక్కుగా ఆమె అన్నారు.

దీనిని దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. తీర్పు ప్రకటించిన తర్వాత న్యాయమూర్తి తాను చదివిన తీర్పును అప్పీల్ చేయాలనుకుంటున్నారా అని ప్రభుత్వ న్యాయవాదిని అడిగారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని సదరు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని నాలుగు రాష్ట్రాలు దాఖలు చేసిన ప్రత్యేక దావా కారణంగా ట్రంప్ పదవీ స్వీకార సమయంలో ఉత్తర్వు ఇప్పటికే జాతీయ స్థాయిలో తాత్కాలికంగా నిలిపివేయబడింది. పుట్టుకతో పౌరసత్వాన్ని అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధంగా వారు చెబుతున్నారు.
అమెరికాలోని 22 రాష్ట్రాలు, ఇతర సంస్థలు ట్రంప్ ఆర్డర్ ఆచరణలోకి రాకుండా ఆపాలని దావా కోర్టును కోరింది. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్న తల్లులు దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే చట్టపరంగా అమెరికా పౌరులు కాని వారి పిల్లలు యునైటెడ్ స్టేట్స్ "అధికార పరిధికి లోబడి ఉండరు" అందువల్ల పౌరసత్వానికి అర్హులు కాదని ట్రంప్ పరిపాలన వాదిస్తోంది. అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకురాబడిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ట్రంప్ దీనిని తీసేయాలనుకోవటం లక్షల మంది జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
వాస్తవానికి 14వ చట్టసవరణను వక్రీకరించారని ట్రంప్ తాజా పౌరసత్వ చట్టమార్పులపై స్పందించారు. అయితే కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ ప్రకారం.. ఇకపై అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించబోరని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బకాయిలో చిక్కుకున్న వారిపై గణనీయమైన ప్రభావాలను చూపుతుందంటున్నారు.
Birthright Citizenship అంటే ఏంటి?
గతంలో అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభించేది. దీనినే జన్మతహ పౌరసత్వం పొందటం అని అంటారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ద్వారా ఈ నిబంధన పొందుపరచబడింది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. ఈ సవరణను జూన్ 13, 1866న యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications