బెంగళూరు నగరం మహానగరంగా విస్తరిస్తోంది. రీసెంట్ గా కర్నాటక ప్రభుత్వం సిటీకి బయటవైపు ఐటీని డెవలప్ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిటిలో రెండవ ఎయిర్ పోర్ట్(bengaluru airport) నిర్మించనున్నట్టు ప్రకటించింది. దీనివల్ల బెంగళూరు ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంతకీ సెకండ్ ఎయిర్ పోర్ట్ లొకేషన్ ఎక్కడ? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటి. అయితే ఇది లొకేషన్ పరంగా బెంగళూరుకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ్నుంచి సౌత్ బెంగళూరుని యాక్సెస్ చేయడం కాస్త కష్టమే. అందుకే ఇప్పుడు సౌత్ బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నారు. తద్వారా నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్ ఎక్కడ రావచ్చు?
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పిన దాని ప్రకారం సౌత్ బెంగళూరు ఎయిర్ పోర్ట్ కోసం మూడు ప్రాంతాలను ఆలోచిస్తున్నారు. నకపుర రోడ్డు దగ్గర కగ్గలిపుర లేదా హారోహళ్లి.. లేదా కుణిగల్ రోడ్డు దగ్గర మరో ప్రాంతాన్ని చూస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ఒకచోట ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉంది.
ఎప్పటికి పూర్తవుతుంది?
ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ కొత్త ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పుడు మొదలుపెడితే, 2033 నాటికి ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది.
సెకండ్ ఎయిర్ పోర్ట్ ఎందుకు?
అత్యంత రద్దీగా ఉండే నగరాలకు ఒకటికి మించి ఎయిర్ పోర్ట్స్ అవసరం అవుతాయి. లండన్ మహానగరానికి అన్ని వైపులా కలిపి మొత్తం ఆరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. మనదేశంలో కూడా న్యూ ఢిల్లీ (నోయిడా), ముంబై (నవీ ముంబై) నగరాలకు రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా రెండు ఎయిర్ పోర్టులు ప్లాన్ చేస్తోంది. కాబట్టి అభివృద్ధి పరంగా చూస్తే బెంగళూరు కూడా రెండో ఎయిర్‌పోర్ట్ అవసరం అవుతుంది.
బెనిఫిట్స్ ఇవే..
- రెండవ ఎయిర్ పోర్ట్ ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకి కనెక్టివిటీ పెరుగుతుంది. విమానాశ్రయాల్లో రద్దీ తగ్గుతుంది.
- అంతేకాకుండా రెండవ ఎయిర్ పోర్ట్ వల్ల దక్షిణ బెంగళూరులో నివసించే ప్రజలు కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
- రెండు ఎయిర్‌పోర్ట్‌లు అందుబాటులోకి వస్తే, దేశీయంగా, అంతర్జాతీయంగా ఎక్కువ విమాన సర్వీసులు వస్తాయి.
- కొత్త ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చి, ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్: మంగళూరు తీరానికి చేరుకున్న రష్యన్ క్రూడ్ ట్యాంకర్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications