ముంబై: ప్రాణాంతక కేన్సర్ కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దీన్ని అభివృద్ధి చేసింది.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా- సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఇవ్వాళ సమావేశం కానుంది. దీనిపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన క్లినికల్ డేటా అంశాలను పరిశీలించనుంది.
సర్వైకల్ కేన్సర్‌ను నయం చేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. క్వాడ్రివలెంట్ హ్యూమన్ పపిల్లోమావైరస్ (క్యూహెచ్‌పీవీ). దీనికి సెర్వావ్యాక్ (Cervavac) అని పేరు పెట్టింది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో మహిళలు సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు.

ఈ రకం కేన్సర్ బారిన పడ్డ పేషెంట్లపై ఇదివరకే ట్రయల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన డేటాను ఈ నెల 8 తేదీన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి సమర్పించింది. క్యూహెచ్‌పీవీపై వ్యాక్సిన్ యాంటీ బాడీస్ రెస్పాన్స్ ఎలా ఉందనే విషయాన్ని ఇందులో పొందుపరిచింది. పేషెంట్స్ వయస్సు, వారికి ఇవ్వాల్సిన డోసుల వారీగా పూర్తి వివరాలతో ఈ ప్రతిపాదనలను రూపొందించింది.
డీజీసీఐ ఆధీనంలో పని చేసే సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి ఈ ప్రతిపాదనలు. ఇవ్వాళ దీనిపై ఈ కమిటీ చర్చించనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీన్నిఅందుబాటులోకి తీసుకుని రావాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్ణయించింది. దీనికి డీజీసీఐ అనుమతి లభించితే.. సర్వైకల్ కేన్సర్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసినట్లు రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు.
సెర్వావ్యాక్ వ్యాక్సిన్ యాంటీబాడీస్ సర్వైకల్ కేన్సర్‌పై తన బేస్‌లైన్ కంటే 1,000 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. త్వరలోనే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా వద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని వివరించారు.


Click it and Unblock the Notifications