SEBI: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త.. సంచలన అడుగులేస్తున్న సెబీ..
SEBI: దేశీయ స్టాక్ మార్కెట్లలో అనేక మంది చిన్న ఇన్వెస్టర్లు ఉన్నారు. వారు ట్రేడింగ్ చేసే సొమ్ము సైతం చాలా తక్కువ. వారికి లిక్విడిటీ క్రంచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి సెబీ తీసుకుంటున్న నిర్ణయం చక్కటి పరిష్కారంగా మారనుంది.
అతి త్వరలో మీరు స్టాక్స్ విక్రయించిన వెంటనే డబ్బు తక్షణమే ఇన్వెస్టర్ల ఖాతాకు బదిలీ చేయబడే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనిపై తాము పనిచేస్తున్నట్లు సెబీ ఛైర్ పర్సన్ మాధబి పూరి బుచ్ వెల్లడించారు. మార్కెట్ రెగ్యులేటర్ SEBI స్టాక్ మార్కెట్‌లోని ట్రేడ్‌ల తక్షణ పరిష్కారం కోసం T+0 సిస్టమ్ అని పిలువబడే సిస్టమ్‌పై పని చేస్తోంది. ప్రస్తుతం ట్రేడింగ్ చేసిన తర్వాతి రోజు సెటిల్మెంట్ జరిగి డబ్బు జమ అవుతోంది. ఇదే విధంగా స్టాక్‌ను కొనుగోలు చేస్తే.. అదే రోజున అది మీ డీమ్యాట్ ఖాతాలో ప్రతిబింబిస్తుంది.

భారతదేశం తన అన్ని సెక్యూరిటీల కోసం T+1 సెటిల్‌మెంట్‌కు మారిన మొదటి ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని సెబీ చీఫ్ వెల్లడించారు. ఈ చర్య ఇన్వెస్టర్లకు అదనంగా రూ.10 వేల కోట్ల మార్జిన్ ఫండ్స్ అందించటంతో సహాయపడుతుందని ఆమె తెలిపారు. ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లు T+2 సిస్టమ్‌పై పనిచేస్తుండగా.. భారత్ T+1 వ్యవస్థలో అగ్రగామిగా ఉందని అన్నారు. ఈ విధానం ఏడాది జనవరి నెలాఖరులో పూర్తిగా అమలులోకి వచ్చింది.
సెకండరీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్‌లలో వేగవంతమైన సెటిల్‌మెంట్ -- పబ్లిక్ ఇష్యూలలో త్వరిత కేటాయింపులు వంటి పెట్టుబడిదారుల, మార్కెట్-స్నేహపూర్వక చర్యల కారణంగా ఇన్వెస్టర్లు ఏడాదికి రూ.3,500 కోట్ల వరకు ఆదా చేయగలిగారని సెబీ చీఫ్ తెలిపారు. మార్కెట్ల పనితీపును మరింత వేగవంతం చేసేందుకు సెబీ చేపడుతున్న చర్యలు దోహదపడనున్నాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications