ఆడిట్ కమిటీ నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండా రూ.1,407 కోట్ల విలువైన రిలేటెడ్-పార్టీ ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించినందుకు వేదాంతా లిమిటెడ్‌ను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ హెచ్చిరించింది. భవిష్యత్తులో వేదాంతా మరోసారి ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సెబీ పేర్కొంది. వేదాంతాకు చెందిన స్వతంత్ర ఆడిటర్స్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక రిపోర్ట్‌లో ఈ ట్రాన్సాక్షన్ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఏ తరహా ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని వెల్లడించకుండా సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఈ ట్రాన్సాక్షన్‌ను నిర్వహించినట్లు కంపెనీ తెలిపిందని, అక్టోబర్ 28వ తేదీన సెబీ జారీ చేసిన లేఖలో పేర్కొంది.
అందుకే సెబీ నిబంధనలు-2015లోని నిబంధన 23(2) ప్రకారం ఇకపై రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌రు ఆడిట్ కమిటీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని సెబీ తెలిపింది. కంపెనీ వివరణ అర్థవంతంగా లేదని భావిస్తున్నట్లు తెలిపింది. అలాగే 2020 అక్టోబర్ 3వ తేదీన జరిగిన బోర్డ్ సమావేశం వివరాలను కూడా కంపెనీ ఆలస్యంగా వెల్లడించిందని ఆడిటర్స్ గుర్తించారు. అనుకోని పరిస్థితుల వల్ల వెల్లడించడంలో జాప్యం చేశామని, మున్ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని వేదాంతా వివరణ ఇచ్చింది.

పై ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సెబి పేర్కొంది. ఇకపై సెబీ నిర్దేశించిన అన్ని రకాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని వేదాంతాకు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని తెలిపింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications