SEBI News: అలర్ట్.. అలర్ట్.. అలర్ట్, సెబీ చెప్పిన మాట వినండి ఇన్వెస్టర్స్..
SME IPO Alert: కరోనా తర్వాతి నుంచి ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఐపీవోల వరద కొనసాగుతోంది. ఈ జోరులో ఇన్వెస్టర్లు తమ డబ్బులు ఎలాంటి కంపెనీల్లో పెడుతున్నారో కూడా పరిశీలించటం లేదు. దీనిని కొందరు ఫ్రంట్ రన్నింగ్ కోసం ఉపయోగించుకుని తద్వారా లాభపడుతున్నారనే అనుమానంతో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరిస్తోంది.
ఈ క్రమంలో సెబీ మార్కెట్లోకి లిస్టింగ్ కోసం వస్తున్న ఎస్ఎమ్ఈ కేటగిరీ ఐపీవోలపై దృష్టి సారించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ కేటగిరీ ఐపీవోల నిబంధనలను కఠినతరం చేసే మూడ్‌లో ఉందని సెబీ హోల్‌టైమ్ మెంబర్ అశ్విని భాటియా పేర్కొన్నారు. ఎస్ఎమ్ఈ ఐపీవోలను పర్యవేక్షించే నిబంధనలను సెబీ కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరిలోపు ఈ అంశంపై సర్క్యులర్ లేఖను తీసుకురావాలని యోచిస్తున్నట్లు భాటియా వెల్లడించారు. ఇందులో ఆడిటర్ల ముందు మెరుగైన పర్యవేక్షణ, కఠిన పరిశీలన ఉండవచ్చన్నారు. సీఏలు తమ పనిని శ్రద్ధగా చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో మెుదటి 6 నెలల కాలంలో మార్కెట్లోకి వచ్చిన మెుత్తం ఐపీవోల విలువ రూ.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం రూ.1.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో కొన్ని ఎస్ఎమ్ఈ కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేసేందుకు తప్పుడు సమాచారాన్ని, తమ కంపెనీల గురించి తప్పుడు చిత్రాన్ని చూపినట్లు గుర్తించిన మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించింది.
పెట్టుబడిదారులు పైన పేర్కొన్న పద్ధతుల గురించి జాగ్రత్తగా ఉండాలని, అటువంటి సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని ఇన్వెస్టర్లను కోరింది. అలాగే సోషల్ మీడియాలో సూచించే పెట్టుబడి చిట్కాలతో ట్రేడింగ్ చేయవద్దని సూచించింది.


Click it and Unblock the Notifications