SEBI Warning: భారతదేశంలో స్టాక్ మార్కెట్లను రెగ్యులేట్ చేసే సంస్థ సెబీ. అక్రమ ట్రేడింగ్ విధానాలను అరికట్టడంతో పాటు పెట్టుబడిదారుల సంరక్షణను ఇది చూసుకుంటుంది. వారిని ఎప్పటికప్పుడు మోసాలనుంచి కాపాడేందుకు హెచ్చరిస్తూనే ఉంటుంది.
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ను సులభతరం చేస్తామని చెబుతున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు వ్యతిరేకంగా క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సోమవారం పెట్టుబడిదారులను హెచ్చరించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిగా మోసంలో భాగస్వాములేనని రెగ్యులేటర్ తెలిపింది. దీనికి తోడు ఆన్‌లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్‌లు మొదలైన వాటి ద్వారా మోసగాళ్లు ప్రజలను స్టాక్ మార్కెట్‌లోకి రప్పిస్తున్నారనే వాస్తవాన్ని సెబీ గుర్తించింది.

సెబీలో రిజిస్టర్ అయిన ఎఫ్‌పిఐలు లేదా ఎఫ్‌ఐఐల ద్వారా స్టాక్ మార్కెట్‌కు యాక్సెస్‌ను అందజేస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానెల్‌లు లేదా యాప్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చిరించింది. మోసగాళ్లు పెట్టుబడిదారులకు గ్యాలం వేసేందుకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. దీనికోసం ఎలాంటి డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదని వారు చెబుతున్నట్లు సెబీ గుర్తించింది.
మోసగాళ్లు తమ స్కీమ్‌లను ఆపరేట్ చేయడానికి వారు తరచుగా తప్పుడు పేర్లతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌లను ఉపయోగిస్తున్నారని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత రెగ్యులేటర్ దీనిపై ఇన్వెస్టర్లను హెచ్చరించింది.
ప్లాట్‌ఫారమ్‌లు FPIతో అనుబంధంగా ఉన్నాయని తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్నట్లు వెలుగులోకి రావటంతో సెబీ ఇన్వెస్టర్లను వీటికి దూరంగా ఉండాలంటూ అప్రమత్తం చేస్తోంది. భారతీయ ఇన్వెస్టర్లకు సెక్యూరిటీస్ మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌పిఐలకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications