Sebi rules change: ఓ పక్కన పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు ఫైనాన్షియల్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఇందుకోసం పలు కొత్త నిబంధనలు ప్రవేశపెడుతూనే, ఇప్పటికే ఉన్నవాటికి మెరుగులు దిద్దుతోంది. తాజాగా అలాంటి రూల్ ఒకటి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఖాతా (BSDA) ఫ్రేమ్‌వర్క్‌ను సెబీ సవరించింది. ఈ అకౌంట్స్ థ్రెషోల్డ్ లిమిట్‌ను 10 లక్షల మేరకు పెంచాలని తీర్మానించింది. 'సెక్యూరిటీస్ మార్కెట్‌లో ప్రజలను మరింత భాగం చేసేందుకు, ఇన్వెస్ట్ చేయడంలో సౌలభ్యం మరియు మార్కెట్ పార్టిసిపెంట్ల ప్రాతినిధ్యాల ఆధారంగా ఈ సదుపాయాన్ని సమగ్రంగా సమీక్షించాం' అని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

ధరల పరంగా సాధారణ డీమ్యాట్ ఖాతా యొక్క తక్కువ వెర్షన్ ఈ బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్. రిటైల్ ఇన్వెస్టర్లకు డీమ్యాట్ ఛార్జీల భారాన్ని తగ్గించడంతోపాటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో సెబీ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. 4 లక్షల లోపు విలువైన సెక్యూరిటీలను కలిగి ఉంటే ఆ ఖాతాల నిర్వహణ ఛార్జీలు శూన్యం కాగా 4 నుంచి 10 లక్షల మధ్య ఉంటే 100 రుసుమును వసూలు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. ఇక 10 లక్షలు దాటితే ఆ డీమ్యాట్ BSDA కింద పరిగణించబడదు. కాబట్టి సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి.
ఈ విలువను డిపాజిటరీ పార్టిసిపెంట్స్ (DP)లు లెక్కిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ NAV లేదా సెక్యూరిటీల రోజువారీ ముగింపు ధర ఆధారంగా హోల్డింగ్ వాల్యూ నిర్ణయించాలని సెబీ తన సర్క్యులర్‌లో వెల్లడించింది. కాగా ఒక వ్యక్తి BSDAకి అర్హత పొందాలంటే డిపాజిటరీలలో అతనికి ఒక డీమ్యాట్ ఖాతా మాత్రమే ఉండాలి. దానికి కూడా సదరు వ్యక్తి ఏకైక లేదా మొదటి హోల్డర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications