Sebi nominee rules: దేశంలోని ఆర్థిక మార్కెట్లను నియంత్రణ సంస్థ సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సమయానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ, పెట్టుబడిదారులకు మేలు జరిగేలా వ్యవహరిస్తుంది. పలు మోసాలకు చెక్ పెట్టే కీలక పద్ధతులను పరిచయం చేస్తుంటుంది. కాగా ఇటీవల తీసుకున్న ఓ డెసిషన్‌పై ఇప్పుడు యూటర్న్ తీసుకుంది.
నామినీలు లేని డీమ్యాట్ సహా మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను స్తంభింపచేయనున్నట్లు గతంలో సెబీ ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరూ నామినీ యాడ్ చేసే పనిలో పడి దాదాపు పూర్తి చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆయా అకౌంట్స్ ఫ్రీజింగ్ చేయాలనే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

కార్పొరేట్ ప్రయోజనాలు మరియు ఫిజికల్ ఫోలియో చెల్లింపుల ఫ్రీజ్ నిలిపివేతను తక్షణమే అమలులోకి తీసుకురావాలని సెబీ నిర్ణయించింది. మార్కెట్ పార్టిసిపెంట్ల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఇలా చేయాల్సి వచ్చినట్లు చెప్పింది. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు ఈ సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
భౌతికంగా సెక్యూరిటీలను కలిగి ఉన్న వారు కూడా డీమ్యాట్ హోల్డర్స్ మాదిరిగానే అన్ని సదుపాయాలు పొందేందుకు అర్హులేనని నియంత్రణ సంస్థ తెలిపింది. నామినేషన్ ఎంపికను సమర్పించనప్పటికీ డివిడెండ్‌లు, వడ్డీలు, పేమెంట్స్ సహా RTAకు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని తేల్చి చెప్పింది. జూన్ 30 లోపు నామినీ యాడ్ చేయకపోతే ఈ సౌకర్యాలను నిలిపివేయనున్నట్లు గతంలో సెబీ ప్రకటించగా.. ఇప్పుడు అదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల విషయంలో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు మరియు డిపాజిటరీలకు కీలక సూచనలు చేసింది. వారు తమ మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు లాగిన్ చేస్తున్నప్పుడు వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్‌లలో పాప్-అప్ నోటిఫికేషన్ ద్వారా నామినేషన్ ఎన్‌రోల్‌మెంట్‌కు ప్రోత్సహించాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications