సెబీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఆప్షన్, కానీ ఆ కండిషన్స్ పక్కా!

భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తన ఉద్యోగుల కోసం ఒక కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల (Geopolitical Situation) నేపథ్యంలో.. ఇంధన పొదుపు (Energy Conservation) , ఖర్చులను తగ్గించుకోవాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

మే 25, 2026 నుండి తదుపరి 8 వారాల పాటు (రెండు నెలలు) ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని సమాచారం. ఇందులో భాగంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఆప్షన్ ఇవ్వడంతో పాటు, అనవసరమైన ప్రయాణాలు, లగ్జరీ హోటల్ ఖర్చులపై తాత్కాలికంగా నిషేధం విధించారు.

SEBI To Roll Out WFH Policy Pause Non Essential Travel And Hotel Expenses For Eight Weeks

ఎవరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఉంటుంది?

సెబీ హ్యూమన్ రీసోర్స్ (HR) డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అందరికీ కాకుండా కేవలం నిర్దిష్ట గ్రేడ్ ఉద్యోగులకు మాత్రమే ఈ డబ్ల్యూఎఫ్‌హెచ్ (WFH) సౌకర్యం లభిస్తుంది.

  • గ్రేడ్ A నుండి C ఉద్యోగులు: అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, , అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులకు వారానికి ఒకరోజు రొటేషన్ పద్ధతిలో ఇంటి నుండి పనిచేసే అవకాశం ఉంటుంది.
  • కండిషన్స్: ఆఫీసులో ఎప్పుడూ కనీసం 50 శాతం మంది సిబ్బంది ఫిజికల్‌గా హాజరయ్యేలా రోస్టర్ సిద్ధం చేయాలని చీఫ్ జనరల్ మేనేజర్లు, రీజినల్ డైరెక్టర్లను ఆదేశించారు. ఇంట్లో ఉండి పనిచేసే వారు డేటా సెక్యూరిటీ, కాన్ఫిడెన్షియాలిటీ (రహస్యాలు) కాపాడాలి. అవసరమైతే వెంటనే ఆఫీసుకు రావడానికి సిద్ధంగా ఉండాలి.
  • వీరికి మినహాయింపు లేదు: గ్రేడ్ D (డిప్యూటీ జనరల్ మేనేజర్) , అంతకంటే పై స్థాయి అధికారులు రోజువారీగా ఆఫీసుకు రావాల్సిందే. అలాగే చైర్మన్ ఆఫీస్ సిబ్బంది, హోల్ టైమ్ మెంబర్స్, సెక్రటరీలు , అకౌంట్స్ అసిస్టెంట్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్తించదు.

కాన్క్లేవ్‌లు, టూర్లపై బ్రేక్!

ఈ 8 వారాల కాలంలో భారీ ఖర్చులతో కూడిన అంతర్గత సమావేశాలు, బ్రెయిన్ స్టార్మింగ్ ప్రోగ్రామ్స్, కామరాడెరీ , కాన్క్లేవ్‌లను (Conclaves) వాయిదా వేయాలని సెబీ స్పష్టంగా ఆదేశించింది. కొత్తగా ఎలాంటి కార్యక్రమాలను షెడ్యూల్ చేయకూడదని పేర్కొంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, హోటల్ బిల్లులు చాలా వరకు తగ్గుతాయని సెబీ భావిస్తోంది.

ఉద్యోగులందరూ వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఆఫీస్ బస్సులు, కార్ పూలింగ్ (ఒకే కారును నలుగురు పంచుకోవడం) లేదా ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) వాడాలని సెబీ ప్రోత్సహిస్తోంది.

మీటింగ్‌లన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనే..

ఎనర్జీ కన్జంప్షన్ (విద్యుత్, ఇంధన వినియోగం) తగ్గించడానికి వీలైనంత వరకు వర్చువల్ మీటింగ్స్ (ఆన్‌లైన్ సమావేశాలు) నిర్వహించాలని సెబీ కోరింది. కేవలం అంతర్గత సమావేశాలే కాకుండా, బయటి స్టేక్‌హోల్డర్లతో (మార్కెట్ ప్రతినిధులతో) జరిగే చర్చలను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే జరపాలని సూచించింది.

గతంలో కోవిడ్-19 సమయంలో సెబీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసింది. మళ్లీ ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా ఈ తాత్కాలిక మార్పులను తీసుకువచ్చింది. సెబీ ప్రధాన కార్యాలయం (Headquarters) తో పాటు అన్ని ప్రాంతీయ , స్థానిక కార్యాలయాల సిబ్బందికి ఈ రూల్స్ వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+