Sebi: ఇన్వెస్టర్స్‌కు సెబీ గుడ్ న్యూస్.. సెకండరీ మార్కెట్‌లో మోసాలకు చెక్.. తెరపైకి కొత్త ఫ్రేమ్ వర్క్
new framework: ఇన్వెస్టర్ల అనుభవాన్ని మెరుగుపరచేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పుడూ ముందుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉన్న నిబంధనలను మారుస్తూ, కొత్త రూల్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ప్రైమరీ మార్కెట్‌లోని ఓ కీలక సదుపాయాన్ని సెకండరీ మార్కెట్ కు కూడా వర్తింపజేసేందుకు సిద్ధమవుతోంది.
పెట్టుబడిదారుల సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు.. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం ASBA సదుపాయాన్ని కల్పించాలని సెబీ భావిస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు సంస్థ చీఫ్ మధబి పూరీ బుచ్ తెలిపారు. తద్వారా స్టాక్స్ కేటాయింపు పూర్తయినప్పుడు మాత్రమే పెట్టుబడిదారుల ఫండ్ వారి ఖాతా నుంచి బదిలీ అవుతుందన్నారు.

దీని ప్రకారం స్టాక్స్ అల్లకేషన్ జరిగే వరకు నిధులు క్లయింట్స్ ఖాతాలోనే ఉంటాయి. క్లియరింగ్ కార్పొరేషన్ సదరు అమౌంట్‌ను బ్లాక్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాతే వాటిని రిలీజ్ చేస్తుంది. తద్వారా నిధులను, సెక్యూరిటీలను క్లయింటే స్వయంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉండదు. సెక్యూరిటీల సెటిల్మెంట్ మొత్తం క్లియరింగ్ కార్పొరేషన్ హ్యాండిల్ చేస్తుంది. దీంతో మోసాలకు కూడా అడ్డుకట్ట వేసే అవకాశం లభిస్తుంది.
ఈ సదుపాయం అమలు వల్ల ఏటా పెట్టుబడిదారులకు 3 వేల 500 కోట్ల వరకు ఆదా అవుతాయని సెబీ చీఫ్ భావిస్తున్నట్లు చెప్పారు. దీనితోపాటు మార్చి 2024 నాటికి అదే రోజు ట్రేడ్ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రెగ్యులేటర్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే T+2గా ఉన్న టైమ్ లైన్ ను T+1కు తగ్గించగా.. రానున్న రోజుల్లో ట్రేడింగ్ రోజునే సెటిల్మెంట్ చేసే పద్ధతిని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications