ఇన్ఫోసిస్‌కు సెబీ వార్నింగ్ లెటర్.. అసలేం జరిగిందంటే..!
Stock Market News: అవును, దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వార్నింగ్ ఇచ్చింది. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లేఖ పంపి మరీ హెచ్చరించింది. అయితే ఇది మీరు అనుకుంటున్న టైపు వార్నింగ్ అయితే కాదు..
స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ (SDD)లో అన్ పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (UPSI) ఎంటర్ చేయడంలో కంపెనీ జాప్యం చేసింది. ఇందుకు గాను ఇన్ఫోసిస్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ "అడ్మినిస్ట్రేటివ్ హెచ్చరిక" జారీ చేసింది. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇకపై SDD నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.

FY 2020-21లో కొవిడ్ మహమ్మారి కారణంగా పెద్దమొత్తంలో సిబ్బంది వారి ఇళ్ల నుంచి పనిచేస్తున్నారని ఇన్ఫోసిస్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. అందువల్ల SDDలో కొన్ని ఎంట్రీలు ఆలస్యంగా నమోదు చేసినట్లు తెలిపింది. సెబీ ఈ సంజాయిషీని అంగీకరించలేదు. SDD సమీక్ష లేట్ కాకుండా నిర్వహించబడాల్సిందేనని తేల్చి చెప్పింది.
స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ అనేది కంపెనీ లేదా వ్యక్తులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. SEBI ప్రోహిబిషన్ ఆఫ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్, 2015 ప్రకారం దీనిని నిర్వహించడం తప్పనిసరి. 2019 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వల్ల సంస్థ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఇన్ఫోసిస్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications