Finfluencer Asmita Patel: భారతీయ స్టాక్ మార్కెట్లను రెగ్యులేటర్ సెబీ పర్యవేక్షిస్తోంది. అయితే చాలా మంది ఫిన్‌ఫ్లూయన్సర్ల ఆగడాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడులను ఆశజూపి భారీగా సొమ్ము చేసుకోవటంపై కఠినంగా వ్యవహరించాలని సెబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెగ్యులేటర్ సెబీ చర్యలతో చాలా మంది చిక్కుకుంటున్నారు.
ఆన్‌లైన్ ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు టిప్స్ అందిస్తున్న అస్మితా జితేష్ పటేల్ అనే ఫిన్‌ఫ్లూయన్సర్ పై సెబీ చర్యలు చేపట్టింది. సెబీ చట్టాల ప్రకారం రిజిస్టర్ కాని ఆమె పెట్టుబడిదారులకు చిట్కాలను అందిస్తోందని సెబీ గుర్తించింది. వాస్తవానికి ఆమెను స్టాక్ మార్కెట్‌లో 'షీ వోల్ఫ్', 'ఆప్షన్స్ క్వీన్' అని పిలుస్తుంటారు. ఆమె పెట్టుబడిదారులకు ట్రేడింగ్ గురించి కోర్సులను కూడా నిర్వహిస్తుండేది. దీనికోసం వారి నుంచి భారీగా రుసుములు వసూలు చేస్తుండేది.

అయితే కోర్సుల్లో ఆమె చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే మంచి లాభాలను పొందవచ్చని భావించిన ట్రేడర్లు నష్టాలను చూశారు. ఆమె మాటలు నమ్మి నష్టాలను మూటకట్టుకున్న చాలా మంది పెట్టుబడిదారులు వరుసగా చేసిన ఫిర్యాదులపై మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. పెట్టుబడి కోర్సులు, చిట్కాల పేరుతో సంపాదించిన రూ.104 కోట్లలో రూ.54 కోట్లను స్వాధీనం చేసుకుంది. అస్మితా జితేష్ పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇదే సమయంలో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్, ట్విట్టర్లలో కూడా భారీగానే ఫాలోవర్లను ఆమె కలిగి ఉంది.
అస్మితకు అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించింది. కంపెనీ వ్యవస్థాపకురాలుగా ఉన్న ఆమె ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్ చేయాలని భావిస్తున్న చాలా మంది ఔత్సాహికులకు ట్రేడింగ్ కోర్సులను ఈ కంపెనీ కొంత రుసుముకు నేర్పిస్తుంటుంది. వరుసగా వచ్చిన ఫిర్యాదులపై సెబీ స్పందిస్తూ ప్రస్తుతం ఆమెపై చర్యలకు ఉపక్రమించింది.
సెబీ వద్ద రిజిస్టర్డ్ కాని వారు స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై టిప్స్ ఇవ్వటాన్ని నిషేధించింన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లను తప్పుడు లాభాలను ఆశజూపి సొమ్ము చేసుకుంటున్నారని సెబీ గుర్తించింది. అస్మిత కోర్సులను ఫాలో అయ్యి నష్టపోయినట్లు దాదాపు 42 మంది నష్టాల గురించి సెబీకి ఫిర్యాదు చేయటం ప్రస్తుత చర్యలకు దారితీసింది. ఆమె asmitapatel.com చూస్తే పెద్ద సెలబ్రిటీలతో కూడా ఆమెకు పరిచయం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతీక్ గాంధీ, అనుపమ్ ఖేర్, కపిల్ దేవ్, మనోజ్ ముంట్షీర్, అనేక మంది కంపెనీ వ్యవస్థాపకులు ఆమె నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ తో కలిసిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications