సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లోన్లు తీసుకున్న వారికి భారీ ఊరట ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రకటి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకు లోన్ల రీపేమెంట్, ఈఎంఐలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల మారటోరియం విధించటంతో క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సెబీ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రుణగ్రహీతలు ఈ మూడు నెలల్లో రుణాలు చెల్లించకపోయినా డిఫాల్ట్‌గా పరిగణించరాదని క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సూచించింది. క్రెడిట్ రేటింగ్ సంస్థ వినియోగదారుని రుణ చెల్లింపు విశ్లేషణలో భాగంగా ఎవరైనా రుణగ్రహీత ఈ మూడు నెలల్లో తాను తీసుకున్న రుణంపై చెల్లించాల్సిన వడ్డీగానీ అసలుగానీ సకాలంలో చెల్లించలేకపోయినప్పటికీ దానిని డిఫాల్ట్‌గా చూడవద్దని తెలిపింది.

ఈ విధానం ఆర్బీఐ నిర్దేశించిన కాలపరిమితి వరకు కొనసాగుతుందని రేటింగ్ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ హోమ్ లోన్, వ్యాపార లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్.. ఇలా వివిధ లోన్లపై మూడు నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications