వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ ఇన్సురెన్స్ సంస్థ LIC ఐపీవో రానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫైనాన్స్ బిల్లులో LIC సవరణ చట్టాన్ని పొందుపరచడంతో త్వరలో చట్టసభల ఆమోదానికి రానుంది. LIC ఐపీఓ సలహాదారులుగా డెలాయిట్, ఎస్బీఐ క్యాప్స్ ఉన్నాయి. LIC IPO పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనున్నారు. పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా మెజారిటీ వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. నియంత్రిత వాటాను అట్టిపెట్టుకుంటుంది. LIC ఐపీవోకు మార్గం సుగమం అవుతోంది.

10 శాతం కాదు.. 5 శాతం
LIC IPOకు వీలుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వేదికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద కంపెనీల లిస్టింగ్ నిబంధనల్ని సవరించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ప్రకటన చేసింది. ప్రస్తుత పెద్ద కంపెనీలు ఐపీవోకు రావాలంటే 10 శాతం అవసరం లేదని, దాదాపు 5 శాతం వాటాలను విక్రయిస్తే చాలునని, ఆ తర్వాత కూడా మూడేళ్లకు బదులు అయిదేళ్లలో 25శాతం వాటాలను ప్రజలకు కేటాయించే అవకాశం ఉందని సెబీ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారీ కంపెనీలు మార్కెట్ లిస్టింగ్ మరింత సరళతరమవుతుంది.

ఎల్ఐసీ ఐపీవో ఇలా...
ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.4,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీలు కనీసం 10 శాతం విక్రయించాలి. అలాగే, 3 సంవత్సరాలలో 25 శాతంగా ఉండాలి. అయితే ఇప్పుడు సెబీ.. ఎల్ఐసీ ఐపీవోకు అనుగుణంగా కొంత సవరణ చేసింది. పోస్ట్ ఇష్యూ అనంతరం రూ.10,000 కోట్లు ప్లస్, మార్కెట్ క్యాప్‌లో 5శాతంతో ఐపీవోకు రావొచ్చునని తెలిపింది. ఒక్కసారిగా 10 శాతం వాటాలకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లకుండా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ప్రభుత్వానికి దక్కింది.
అంచనా ప్రకారం ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉంటుంది. వ్యాల్యుయేషన్ తర్వాత రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. కొత్త సెబి నిబంధనల ప్రకారం ఎల్ఐసీ రూ.10 లక్షల మార్కెట్ క్యాప్ పైన రూ.55,000 కోట్లతో ఇష్యూకి రావాలి. ఇది రూ.10,000 కోట్లు ప్లస్ 5 శాతం. మార్కెట్ క్యాప్ రూ.15 లక్షల కోట్లుగా ఉంటే రూ.80,000 కోట్లతో ఇష్యూకి రావాల్సి ఉంటుంది. రూ.8 లక్షల కోట్లు అయితే రూ.45,000 కోట్లు అవుతుంది.

అందుకే ఈ నిర్ణయం
ఎల్ఐసీ మార్కెట్లోకి రావడానికి కంపెనీ పరిమాణం కూడా అడ్డంకిగా చెబుతున్నారు. పాత నిబంధనల ప్రకారం ఇది మార్కెట్లోకి వస్తే రూ.లక్ష కోట్లకు పైనే అవసరం. అప్పుడు మార్కెట్ దీనిని ఏమాత్రం తట్టుకొనే పరిస్థితి ఉండదు. దీంతోపాటు ఇష్యూ తర్వాత మార్కెట్ మూలధన విలువ పెరిగే కొద్దీ పబ్లిక్ వాటాలపై ఉన్న నిబంధనలను సరళతరం చేసింది. ఈ నిర్ణయం ఎల్ఐసీకి ఉపయోగమే. బుధవారం జరిగిన సెబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications