ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వ్యక్తులకు ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) పది రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ఈ బహుమతి రూ.1 కోటి కాగా దీనిని రూ.10 కోట్లకు పెంచినట్లు తెలిపింది.
ప్రకటించిన రివార్డ్ రూ.1 కోటి, అంతకంటే తక్కువ ఉంటే తుది ఉత్తర్వులు జారీ అయిన తర్వాత రివార్డ్ మంజూరు ఉంటుంది. రూ.1 కోటి కంటే ఎక్కువ రివార్డ్ అయితే సెబి రూ.1 కోటి వరకు మధ్యంతర రివార్డ్ అందిస్తుంది. ఇది కూడా ఉత్తర్వులు జారీ అయ్యాక వస్తుంది. మిగతా మొత్తం ఆ తర్వాత వస్తుంది.

ఇక, స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనలకు సవరణలతో సహా గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లకు కొత్త నిబంధనావళిని పరిచయం చేసే చర్యలకు ఆమోదం తెలిపింది సెబి. రెసిడెంట్ ఇండియన్ ఫండ్ మేనేజర్స్ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో భాగంగా ఉండేందుకు అంగీకరించింది.
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను నిర్వహిస్తోన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అలాంటి పథకాలతో ఉండే రిస్కుకు అనుగుణంగా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే విషయంలో నిబంధనలను సవరించింది. కొత్త ఫండ్ ఆఫర్ ద్వారా సమీకరించే మొత్తంలో ఒక శాతం లేదా రూ.50 లక్షలు ఏది తక్కువ అయితే దానిని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఆర్థిక పారామితుల ఆధారంగా వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, కుటుంబ ట్రస్ట్‌లు, సింగిల్ ఓనర్ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ట్రస్ట్‌లు, బాడీ కార్పొరేట్స్ గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లుగా ఉంటారని తెలిపింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications