F&O rules: ట్రేడింగ్ సహా ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి సెబీ ఎప్పటికప్పుడు నిబంధనలను కఠినతరం చేస్తుంటుంది. పెట్టుబడిదారుల సంపదను కాపాడేందుకు నిత్యం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. తాజాగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కు సంబంధించి నూతన ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది కనుక అందుబాటులోకి వస్తే F&O సెగ్మెంట్ స్థితిగతులు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డెలివరీస్ ట్రేడింగ్ సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్‌ల పార్టిసిపేషన్ భారీగా పెరుగుతోంది. అయితే దురదృష్టవశాత్తు 91 శాతం మంది నష్టాల పాలవుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన మార్కెట్ నియంత్రణ సంస్థ.. నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. మార్కెట్ పార్టిసిపెంట్స్ యాక్టివ్‌గా పాల్గొనేందుకు, లిక్విడిటీని పెంచేందుకు ఇండిసెస్‌కు వర్తించే రూల్స్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఓ స్టాక్ ను డెరివేటివ్ సెగ్మెంట్లో అనుమతించాలంటే సాధారణ రోజుల్లో 75 శాతం దానిలో ట్రేడింగ్ జరిగి ఉండాలని సెబీ ప్రతిపాదించింది. మార్కెట్లో మానిప్యులేషన్ నివారణకు, లిక్విడేషన్ పెంపునకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. డెరివేటివ్స్ మార్కెట్ నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను అంచనా వేయడానికి, వాటిని తిప్పి కొట్టడానికి ఓ ప్యానల్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఒకవేళ రెగ్యులేటర్ ప్రతిపాదనలు అమలు అయితే ప్రస్తుతం F&O సెగ్మెంట్లో ట్రేడ్ అవుతున్న 182 స్టాక్స్‌లో కేవలం 25 మాత్రమే అర్హత సాధిస్తాయని IIFL తన నోట్‌లో పేర్కొంది. స్టాక్స్ లో 75 శాతం ట్రేడింగ్ జరిగి ఉండాలని సెబీ చెబుతున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఎంత సమయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. వీటికి తోడు యావరేజ్ ప్రీమియం డైలీ టర్నోవర్ 150 కోట్లు, గరిష్ఠ ఓపెన్ F&O కాంట్రాక్టుల సంఖ్య 1,250 నుంచి 1,750 మధ్య ఉండాలనే కొన్ని ప్రతిపాదనలను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications