Instant Settlement: గతంలో స్టాక్ మార్కెట్లలో నిర్వహించే ట్రేడ్లను T+2 విధానంలో సెటిల్ చేసేవారు. అంటే ట్రేడ్ నిర్వహించిన రెండు రోజుల్లో దానిని క్లియర్ చేసేవారు. అయితే ఈ గడువును కుదించాలని కొంత కాలం కిందట మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్ణయించింది.
దీనిపై తాజాగా సెబీ తన కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. ఇందులో సేమ్ డే సెటిల్మెంట్(T+0), ఇన్‌స్టంట్ సెటిల్‌మెంట్‌ను ఆప్షనల్ ప్రాతిపదికన రెండు దశల్లో అమలు చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఇటీవలి కాలంలో దేశంలోని చెల్లింపు వ్యవస్థల్లో వచ్చిన గణనీయమైన పరిణామాలు, ఆధునిక సాంకేతికత, క్లియరెన్స్ అండ్ సెటిల్మెంట్ టైమ్‌లైన్‌లను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశాలను కల్పిస్తున్నట్లు సెబీ పేర్కొంది.

ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌తో పాటు, షార్ట్ సెటిల్మెంట్ సైకిల్‌ను ఒక ఎంపికగా ప్రవేశపెట్టవచ్చని సెబీ పేర్కొంది. అయితే T+0 సెటిల్మెంట్ సైకిల్ విధానాన్ని ఫేజ్-1 కింద మధ్యాహ్నం 1.30 లోపు నిర్వహించే ట్రేడ్లకు ముందుగా అప్లై చేయాలని సెబీ భావిస్తోంది. ఈ ప్రక్రియలో మార్కెట్ ట్రేడర్లు నిర్వహించిన ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ సాయంత్రం 4.30 గంటల కల్లా పర్తవుతుందని సెబీ స్పష్టం చేసింది.
రెండవ ఫేజ్ ప్రక్రియలో సాయంత్రం 3.30 గంటల వరకు నిర్వహించిన అన్ని ట్రేడ్లను సెటిల్మెంట్ అదేరోజు పూర్తి చేయాలని సెబీ భావిస్తోంది. దీనికి ముందు 2002లో ఐదు రోజులుగా ఉన్న సెటిల్మెంట్ సమయాన్ని మూడు రోజులకు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత 2003లో దానిని రెండు రోజులకు కుదించారు.
ప్రస్తుతం T+0 సెటిల్మెంట్ విధానాన్ని మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్ 500 కంపెనీలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సెబీ వెల్లడించింది. ఇది పెట్టుబడిదారులకు అధిక లిక్విడిటీని అంధించటంతో పాటు ఎక్కువ క్యాపిటల్ అవసరాన్ని తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆలాగే మార్కెట్ ఎఫీషియన్సీని ఇది పెంచుతుందని సెబీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications