SEBI News: చిన్న రిటైల్ పెట్టుబడిదారులకు సైతం అధిక స్టాక్ ధర కలిగిన కంపెనీల్లో వాటాలు కొనాలని ఉంటుంది. అయితే వారి దగ్గర ఉండే మెుత్తం కనీసం కొన్ని సార్లు ఒక్క షేరు కొనుగోలు చేసేందుకు కూడా సరిపోదు. దీనికి పరిష్కారం చూపాలని సెబీ యోచిస్తోంది.
భారతదేశంలో షేర్ల పాక్షిక యాజమాన్యాన్ని ప్రవేశపెట్టడానికి సెబీ ఆసక్తిగా ఉంది. ఈ పద్ధతి ఇప్పటికే అమెరికా మార్కెట్లలో అనుమతించబడుతోంది. చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు Apple, Meta, Alphabet వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో పాక్షిక వాటాలను కొనుగోలు చేశారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ అమలు చేయాలంటే అందుకు సెబీ చట్టాలు, కంపెనీల చట్టాల్లో మార్పులు అవసరమని తెలుస్తోంది.

ఉదాహరణకు ప్రఖ్యాత టైర్ల తయారీ సంస్థ MRF షేర్ ధర రూ.1.09 లక్షలుగా ఉంది. ఒక చిన్న పెట్టుడిదారుడు లక్షకు పైగా పెట్టుబడితో ఒక్కో షేరును కొనలేరు. ఇందులో కొంత నిర్థిష్ట భాగాన్ని కొనుగోలు చేయటం ద్వారా పాక్షికంగా యాజమాన్యం పొందేందుకు వెసులుబాటు కలుగుతుంది. దేశంలో రూ.20,000 కంటే ఎక్కువ ధర కలిగిన కంపెనీలను గమనిస్తే.. పేజ్ ఇండస్ట్రీస్ రూ.39,612, హనీవెల్ ఆటోమేషన్ ఇండియా రూ.39,308, శ్రీ సిమెంట్ రూ.25,681, అబాట్ ఇండియా రూ.22,800, నెస్లే ఇండియా రూ.21,922గా ఉన్నాయి. ఇలాంటి ఖరీదైన షేర్లు భారత మార్కెట్లలో అనేకం ఉన్నాయి.

క్యాపిటల్ మార్కెట్ వాచ్‌డాగ్ పాక్షిక యాజమాన్యాన్ని తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నట్లు సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ అన్నారు. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే పాక్షిక యాజమాన్యం కాన్సెప్ట్‌కు సంబంధించిన చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు లేదా REITలు కూడా పెట్టుబడిదారులకు పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో కొంత భాగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఫేమస్ అయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications