Trade Settlement: ఇక గంటలోనే ట్రేడింగ్ సెటిల్మెంట్.. సెబీ దూకుడు.. 2024 చివరికల్లా..
Trade Settlement: పాత చింతకాయ పచ్చడి లాంటి ట్రేడింగ్ రూల్స్, రెగ్యులేషన్లలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో T+1 ట్రేడింగ్ విధానం ప్రకటించిన తర్వాత మరో ముందడుగుతో ముందుకొచ్చింది.
2024 నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడ్ సెటిల్మెంట్లను గంటలో పూర్తి చేసే సరికొత్త యుగాన్ని ప్రారంభించాలని సెబీ యోచిస్తోంది. వివరాల ప్రకారం మార్చి 2024 నాటికి ఈ సూపర్ స్పీడ్ సెటిల్మెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి ఒక గంట సెటిల్‌మెంట్ సైకిల్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో సెబీ చీఫ్ చెప్పారు.

అలాగే రియల్ టైమ్ సెటిల్మెంట్ విధానం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని సెబీ చీఫ్ పూరీ బుచ్ తెలిపారు. గంటలోనే ట్రేడ్ సెటిల్మెంట్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అవసరమైన పూర్తి సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే దానిని తాము అందిపుచ్చుకోవాల్సి ఉన్నట్ల స్పష్టం చేశారు.

క్షణాల్లో ట్రేడింగ్ సెటిల్మెంట్ విధానానికి మరికొన్ని సాంకేతిక పరిణామాలు అవసరమని .. ఇందుకోసం మరికొంత కాలం పట్టవచ్చని సెబీ చీఫ్ తెలిపారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దిగువ కంపెనీలతో ప్రారంభించి దశలవారీగా T+2 నుంచి T+1 సెటిల్‌మెంట్‌కి భారతదేశం మారింది. టాప్ కంపెనీలు జనవరి చివరిలో మాత్రమే తక్కువ సెటిల్‌మెంట్ సైకిల్‌కి మార్చబడ్డాయి. ప్రస్తుతం T+1 విధానం కింద ట్రేడింగ్ జరిగిన తర్వాతి రోజున సెక్యూరిటీలు, నగదు బదిలీ పూర్తవుతోంది.


Click it and Unblock the Notifications