డీమ్యాట్ ఖాతాలకు నామినీ తప్పనిసరిగా యాడ్ చేయాలని సెబీ స్పష్టం చేసింది. డీమ్యాట్ ఖాతాకు నామినీని జత చేసేందుకు మార్చి 31 చివరి తేదీగా ఉంది. ఆలోపు డీమ్యాట్ ఖాతాకు నామినీ యాడ్ చేయుకంటే ఖాతా ఫ్రీజ్ అవుతుందని సెబీ హెచ్చరించింది. జులై 2021లో, సెబీ ప్రస్తుతం ఉన్న అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులందరినీ నామినీని యాడ్ చేయాలని సెబీ కోరింది. మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID, నామినీ గుర్తింపు వివరాలు వంటి గతంలో అవసరమైన వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి. కొత్త ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను తెరిచే పెట్టుబడిదారులు నామినీని కచ్చితంగా యాడ్ చేయాలి.
డీమ్యాట్ ఖాతాకు నామినీని ఇలా యాడ్ చేయండి
1. మీ డీమ్యాట్ ఖాతాకు లాగిన్ చేయాలి.
2. ప్రొఫైల్ సెగ్మెంట్ కింద 'నా నామినీలు'కి క్లిక్ చేయాలి.

4. నామినీ వివరాలను నమోదు చేయాలి. నామినీ ID ఫ్రూప్ అప్‌లోడ్ చేయండి. పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, మీరు నామినీకి కేటాయించాలనుకుంటున్న 'శాతం'లో నామినీ వాటాను నమోదు చేయండి
5. ఆధార్ OTPతో పత్రంపై ఈ-సంతకం చేయండి
6: నామినీ వివరాలు వెరిఫికేషన్ కోసం ప్రాసెస్ చేస్తారు. 24-48 గంటల్లో డీమ్యాట్ ఖాతాకు నామినీ యాడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications