Satyam scam: సత్యం కంప్యూటర్స్ ప్రమోటర్లకు మరో దెబ్బ.. సెబీ కీలక ఆదేశం..
Satyam News: చాలా కాలం తర్వాత మరోసారి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా సెబీ ఇచ్చిన తీర్పు కంపెనీ ప్రమోటర్లకు ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి.
వివరాల్లోకి వెళితే సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ స్కామ్ కేసులో 6 మంది వ్యక్తులు, సంస్థలను అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. సెబీ ఆదేశాల ప్రకారం మెుత్తం రూ.1,747.5 కోట్లు చెల్లించాలని సూచించింది. ఇందులో రూ.624 కోట్ల అసులుపై 12 శాతం చొప్పున 15 ఏళ్ల కాలానికి రూ.1,123 కోట్ల వడ్డీ మెుత్తం ఉంది. డబ్బు మెుత్తాన్ని జనవరి 2024 నాటికి చెల్లించాలని సెబీ తాజాగా స్పష్టం చేసింది.

సెబీ ఆర్డర్ ప్రకారం రామలింగం రాజు (సత్యం మాజీ చైర్మన్), రామరాజు (సత్యం మాజీ ఎండీ), సూర్యనారాయణ రాజు (రామలింగం రాజు సోదరుడు), SRSR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనివాస్ (సత్యం మాజీ CFO), రామకృష్ణ (మాజీ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్) డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంది. సెబీ ఆర్డర్ కి ముందు ఫిబ్రవరి 2, 2023 నాటి సెక్యూరిటీ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్(SAT) ఆర్డర్ వచ్చింది. ఈ కేసులో రికవరీకి SEBI ఇంతకు ముందు ఆదేశించింది. తర్వాత దీనిని నిందితులు SAT, సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
రామలింగరాజు రూ.20.43 కోట్లు, రామరాజు రూ.20.43 కోట్లు, సూర్యనారాయణ రాజుకు రూ.51.44 కోట్లు, SRSR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.518.366 కోట్లు, శ్రీనివాస్ రూ.9.58 కోట్లు, రామకృష్ణ రూ.3.83 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీని విడిగా చెల్లించాలని పేర్కొంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిందితులు మెుత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని కోరింది.


Click it and Unblock the Notifications