Ola IPO: ఫలించిన ఓలా ప్లాన్స్.. మార్కెట్ ఎంట్రీకి లైన్ క్లియర్.. ఇన్వెస్టర్స్ మీరు సిద్ధమా?
IPO News: ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థగా ఓలా సేవలందిస్తోంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ చురుకుగా వ్యవహరిస్తోంది. ఎప్పటినుంచో మార్కెట్లో అరంగేట్రం చేయాలని భావిస్తోంది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా దీనికోసం వేచి చూస్తున్న ఇన్వెస్టర్లకు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.
ఓలా ఎలక్ట్రిక్ IPOకు మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమెదం లభించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. దీని విలువ 5 వేల 500 కోట్లుగా ఉండవచ్చని తెలుస్తోంది. నెలలోపు లిస్ట్ కావచ్చని సమాచారం. కాగా ఇందుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లోనే ఓలా తన DRHP IPO కోసం దాఖలు చేసింది. కాగా ఇప్పుడు అది కార్యరూపం దాల్చనుంది.

5 వేల 500 కోట్ల ఈక్విటీ షేర్లను ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఇష్యూ చేయనుంది. మరో 9.52 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులను సేకరించాలని ప్రతిపాదించింది. కంపెనీ ప్రమోటర్ భవిష్ అగర్వాల్ IPOలో సగభాగం 4.7 కోట్ల షేర్లను OFS ద్వారా ఉపసంహరించుకుంటారు. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా వెయ్యి కోట్లను సమీకరించాలని భావించగా.. అలాంటి పరిస్థితుల్లో తాజా ఇష్యూ పరిమాణం ఆ మేరకు తగ్గుతుందని DRHPలో పేర్కొంది.
FY21లో 39 కోట్లుగా ఉన్న కంపెనీ రుణాలు FY24 నాటికి 1,617 కోట్లకు పెరిగాయి. IPO ద్వారా సమీకరిస్తున్న నిధుల్లో కొంత భాగాన్ని యాక్సిస్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థలకు రుణ చెల్లింపుల కోసం ఉపయోగించనుంది. EV పోర్ట్‌ఫోలియోతో పాటు గిగాఫ్యాక్టరీ, సేల్స్ అభివృద్ధికి మిగిలిన మొత్తాన్ని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications