Mutual Funds: పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా నిబంధనలు మారుస్తూ, పలు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తుంది. ఈమధ్య మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఓ విషయంపై సెబీ అప్ డేట్ ఇచ్చింది.
KYC తప్పనిసరి:
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ సాధారణంగా ఇ-వాలెట్లను వినియోగిస్తుంటారు. అయితే ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విధించిన KYC నిబంధనలకు అనుగుణంగా ఉండాలని SEBI ఆదేశించింది. మే 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ప్రకటించింది.

డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి:
మే 8, 2017న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓ సర్క్యులర్ జారీ చేసింది. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇ-వాలెట్లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఒక ఆర్థిక సంవత్సరంలో 50 వేల లోపు వీటిద్వారా పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. యువతను సేవింగ్స్ వైపు ఆకర్షించడానికి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యల్లో ఇదొక భాగం.
మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి?
మ్యూచువల్ ఫండ్స్ అనేవి అనేక మంది పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరిస్తాయి. వీటిని తిరిగి స్టాక్స్, బాండ్స్, మనీ మార్కెట్ వంటి ఇన్వెస్ట్ మెంట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడతాయి. తద్వారా సంపదను పెంచుకుంటాయి. అయితే గృహాల్లోని సేవింగ్స్ ను సైతం మార్కెట్ లోకి తరలించే విధంగా ప్రస్తుత విధానాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సెబీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications