SEBI: ఇన్వెస్టర్ల ప్రశ్నలకు సెబీ ఏఐతో సమాధానాలు.. అనుమానాలు ఇలా తీర్చుకోండి

SEBI chatbot SEVA: దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతున్న వేళ దానికి తగినట్లుగా వారి కోసం మార్కెట్ రెగ్యులేటర్ సాంకేతికతను ప్రవేశపెడుతోంది. ప్రజలకు ఉండే అనేక అనుమానాలను నివృత్తి చేసేందుకు తాజాగా ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంది.

వివరాల్లోకి వెళితే మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) సోమవారం పెట్టుబడిదారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ 'సేవా'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బీటా వెర్షన్ ఇటీవలే ప్రారంభించబడింది. ఇన్వెస్టర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని దీనిని సెబీ రూపొందించింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమకు ఉన్న అనుమానాలు, ప్రశ్నలకు ఈ చాట్‌బాట్ సమాధానాలను క్షణాల్లో అందిస్తోంది.

SEBI launched AI based chatbot SEVA for answering investors Questions SAARTHI mobile app

మోసాల గురించి నివేదించటం, వాటి పరిష్కారాలకు సంబంధించిన ప్రశ్నలకు ఏఐ చాట్‌బాట్ ఇన్వెస్టర్లకు తన సమాధానాల ద్వారా గ్రైడ్ చేయనుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన SEVA చాట్‌బాట్‌ను వినియోగదారులు సెబీ వెబ్‌సైట్‌లో ఉపయోగించవచ్చు. అలాగే Android, iOS మెుబైల్ యూజర్లు దీనిని SAARTHI మొబైల్ యాప్‌లో కూడా ఉపయోగించవచ్చు. చాట్‌బాట్ సర్వీస్ బీటా వెర్షన్‌లో పలు ఫీచర్లను జోడించినట్లు సెబీ తెలిపింది. ప్రస్తుతం ఈ చాట్‌బాట్ భారత సెక్యూరిటీ మార్కెట్, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది.

సెబీ జూన్‌లో సారథి యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌లో ఫైనాన్షియల్ 'కాలిక్యులేటర్' కూడా ఉంది. వీటిలో కేవైసీ విధానాలు, మ్యూచువల్ ఫండ్స్, ETFలు, స్టాక్ మార్కెట్‌లో షేర్ల కొనుగోలు అమ్మకం, పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కార విధానం, ఆన్‌లైన్ వివాద పరిష్కారం (ODR) మొదలైనవి ఉన్నాయి. అలాగే ఇన్వెస్టర్లకు పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్‌లో సహాయం చేయడానికి రూపొందించబడిన యాప్‌లో అనేక వీడియోలు సైతం అందుబాటులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+