డిజిటల్ బంగారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల చేసిన హెచ్చరిక పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆన్‌లైన్ యాప్‌లు, ఫిన్‌టెక్ సంస్థల ద్వారా అందించే డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలో లేవని, పెట్టుబడిదారులు అర్థం చేసుకోలేని రిస్క్‌లకు గురయ్యే అవకాశం ఉందని సెబీ స్పష్టం చేసింది.
డిజిటల్ గోల్డ్ అంటే యాప్‌ల ద్వారా చిన్న మొత్తాల్లో బంగారం కొనడం, భద్రపరచడం, విక్రయించడం అనే సులభ మార్గం. ఇది భౌతిక బంగారం కొనుగోలు చేయకుండా, డిజిటల్ రూపంలో బంగారాన్ని కలిగి ఉండే అవకాశం ఇస్తుంది. అయితే నవంబర్ 8, 2025న జారీ చేసిన తాజా నోటీసులో, ఈ ఉత్పత్తులు ఏవీ సెబీ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి అధికార సంస్థల పర్యవేక్షణలో లేవని సెబీ స్పష్టంచేసింది.

సహజ్‌మనీ వ్యవస్థాపకుడు మరియు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..ఈ యాప్‌లు సెబీ పర్యవేక్షణలో లేవు. కాబట్టి ఈ ప్లాట్‌ఫారమ్‌లు డిఫాల్ట్ అయ్యినా పెట్టుబడిదారులకు రక్షణ ఉండదని తెలిపారు. డిజిటల్ బంగారంలో పెట్టుబడి చేయడంలో ప్రధాన సమస్య నియంత్రణ లేకపోవడం. సెబీ ఈ ఉత్పత్తులను సెక్యూరిటీ లేదా కమోడిటీ డెరివేటివ్‌గా గుర్తించలేదు. అంటే ఈ కంపెనీలు పెట్టుబడిదారుల డబ్బును ఎలా ఉపయోగిస్తున్నాయో, భౌతిక బంగారం నిజంగా వాల్ట్‌లో ఉందో లేదో ఎవరూ పర్యవేక్షించరని తెలిపారు.
ప్లాట్‌ఫారమ్‌లు బంగారం అందించడంలో విఫలం కావచ్చు లేదా రిడెంప్షన్ సమయంలో డిఫాల్ట్ కావచ్చు. ఇది కౌంటర్‌పార్టీ రిస్క్. అలాగే బంగారం సురక్షితంగా నిల్వ చేయకపోతే ఆపరేషనల్ రిస్క్ కూడా ఉంటుంది. ఒక యాప్ మీ బంగారాన్ని ఖజానాలో నిల్వ చేస్తోందని చెబుతుందనుకోండి. కానీ దానిని ధృవీకరించే స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ లేకుంటే మీ పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది. కంపెనీ మూసివేస్తే, మీరు పెట్టిన డబ్బు తిరిగి పొందే మార్గం ఉండకపోవచ్చన్నారు.
సెబీ హెచ్చరిక డిజిటల్ బంగారాన్ని నిషేధించడం కాదు.. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండమని సూచించడం మాత్రమే. సెబీ సూచన ప్రకారం పెట్టుబడిదారులు తమ డిజిటల్ గోల్డ్ హోల్డింగ్‌లను గోల్డ్ ETFs (Exchange Traded Funds) లేదా EGRs (Electronic Gold Receipts) వంటి నియంత్రిత ఉత్పత్తులకు మార్చుకోవచ్చు. ఇవి సెబీ పర్యవేక్షణలో ఉండే కారణంగా స్పష్టమైన నియంత్రణ, పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ పొందుతాయి. ఏదైనా సమస్య తలెత్తితే చట్టపరమైన సహాయం కూడా లభిస్తుంది. ఇది ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ యాప్‌లలో లభించదు.
బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
డిజిటల్ గోల్డ్ సౌలభ్యం కారణంగా ప్రజాదరణ పొందినప్పటికీ, భద్రత కూడా అంతే ముఖ్యమని సెబీ చెబుతోంది. రూ.10 నుండి ప్రారంభమయ్యే ఈ పెట్టుబడులు చౌకగా అనిపించినా, నియంత్రణ లేకుండా డబ్బు పూర్తిగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తుంది. సెబీ తాజా హెచ్చరిక డిజిటల్ బంగారాన్ని చట్టవిరుద్ధం చేయదు. కానీ దాని బలహీనతలను బయటపెడుతుంది. కాబట్టి పెట్టుబడిదారులు సౌలభ్యం కన్నా భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవాలి. స్వల్పకాలిక అవసరాల కోసం డిజిటల్ బంగారం ఉపయోగపడవచ్చు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం గోల్డ్ ETFs లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి నియంత్రిత ఉత్పత్తులను ఎంచుకోవడం సురక్షిత మార్గం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications