For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెట్ సెక్యూరిటీస్‌ల జారీకి సెబీ కొత్త నిబంధనలు

|

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వారం రోజుల క్రితం.. కంపెనీలు డెట్ సెక్యూరిటీలు జారీచేసే ముందు రికవరీ ఖర్చుల నిధి (REF)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. స్టాక్ ఎక్స్చేంజీ వద్ద ఇష్యూ పరిమాణంలో 0.01 శాతం(గరిష్టంగా రూ.25 లక్షల వరకు) ఈ నిధిలో కంపెనీలు డిపాజిట్ చేయాలని ఓ సర్క్యులర్ విడుదల చేసింది.

ఈ కార్డుతో ఉచితంగా లేదా తక్కువ ధరకే రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు!ఈ కార్డుతో ఉచితంగా లేదా తక్కువ ధరకే రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు!

ఏదేనీ కంపెనీలు ఎగవేతకు పాల్పడితే న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమయ్యే ఖర్చుల కోసం డిబెంచర్ ట్రస్టీస్ ఈ నిధులను ఉపయోగించుకుంటుంది. నగదు లేదంటే బ్యాంకు గ్యారంటీ లాంటి నగదు సమానమైనవీ డిపాజిట్ చేయవచ్చునని సెబ తెలిపింది. ఎక్స్చేంజీలు ఈ నిధులను ఏదేని వాణిజ్య బ్యాంకులో ప్రభుత్వ సెక్యూరిటీస్ లేదా ట్రెజరీ బిల్లులు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ స్కీంలలో పెట్టుబడిగా పెడుతుంది.

Sebi issues new rules for recovery expense fund

వాటిపై వచ్చే వడ్డీని మళ్లీ ఆర్ఈఎఫ్‌లో జమ చేస్తుంది. నమోదిత డెట్ సెక్యూరిటీస్ కాలపరిమితి తీరిన తర్వాత కూడా మరో ఆరు నెలలు వర్తించేలా బ్యాంకు గ్యారెంటీని కంపెనీలు ఇవ్వవలసి ఉంటుంది. బ్యాంకు గ్యారెంటీ వర్తింపు కొనసాగేలా చూసుకోవాలని, గడువు తేదీకి కనీసం ఆరు రోజుల ముందే రెన్యూవల్ చేసుకోవాలని సెబీ వెల్లడించింది.

English summary

డెట్ సెక్యూరిటీస్‌ల జారీకి సెబీ కొత్త నిబంధనలు | Sebi issues new rules for recovery expense fund

The Securities and Exchange Board of India (Sebi) on Thursday said issuers of listed orproposed to be listed debt securities would have to deposit 0.01% of the issue size or maximum of Rs 25 lakh towards creation of recovery expense fund.
Story first published: Thursday, October 29, 2020, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X