Stock market news: పెట్టుబడిదారుల సంపదను కాపాడేందుకు, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా ట్రేడింగ్ కొనసాగించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అవసరమైన సమయంలో మోసాలకు పాల్పడిన, నిబంధలు పాటించని పలు సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలకు కూడా వెనుకాడదు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు మంచి పేరుంది.
ట్రేడర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం సెబీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీల లావాదేవీలకు సంబంధించిన నగదును పెట్టుబడిదారులకి నేరుగా అందించేందుకు పావులు కదుపుతుంది. అంటే క్లియరింగ్ కార్పొరేషన్ నుంచి బ్రోకర్ల పూల్ అకౌంట్లకు కాకుండా ఆ మొత్తాన్ని పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాకు డైరెక్టుగా బదిలీ చేయాలని భావిస్తోంది.

ఇదే వ్యవహారంపై స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్లు సహా వాటాదారులందరితో సెబీ సమావేశాలు నిర్వహించింది. ఆయా సంస్థలు దీనిపై సానుకూలంగా స్పందించడంతో తన ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చింది. ఈ విధానాన్ని అక్టోబర్ 14 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేసింది.
అయితే ఇప్పటివరకు బ్రోకరేజ్‌లు మేనేజ్ చేసిన కొన్ని పనులను అడ్జస్ట్ చేయడంపై సెబీ దృష్టిపెట్టింది. వాటిలో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఈ సదుపాయం కింద కొనుగోలు చేసిన షేర్లు, పేమెంట్ చేయని సెక్యూరిటీలను చురుకుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పెట్టుబడిదారులతో పాటు క్లియరింగ్ కార్పొరేషన్ లకు ఓ మానిటరింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలి. ప్రస్తుతం అదే ప్రేమ్ వర్క్ పై సెబీ పనిచేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications