Sebi new rules: పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈసారి స్టాక్ బ్రోకర్లకు నియంత్రణ సంస్థ ఝలక్ ఇచ్చింది. క్లయింట్ల నిధులను బ్యాంక్ గ్యారెంటీలుగా వినియోగించుకోవడంపై నిషేధం విధించింది.ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి రానుండగా.. సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న అన్ని బ్యాంకు గ్యారెంటీలను క్లోజ్ చేయాలని ఆదేశించింది.
పెట్టుబడిదారుల సొమ్మును స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయడాన్ని అరికట్టేందుకు సెబీ చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగం. స్టాక్ బ్రోకర్లు (SB) మరియు క్లియరింగ్ మెంబర్స్ (CM) ప్రస్తుతం ఖాతాదారుల నిధులను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు. తద్వారా క్లియరింగ్ కార్పొరేషన్‌లకు అధిక మొత్తంలో బ్యాంక్స్ గ్యారెంటీలు (BG) జారీ చేస్తున్నాయి. ఈ విధానం కారణంగా క్లయింట్ల నిధులు రిస్కులో పడుతున్నాయి. దీనిని మార్చడానికే ప్రస్తుతం సెబీ నడుం బిగించింది.

ఏదైనా విభాగంలోని స్టాక్ బ్రోకర్లు మరియు క్లియరింగ్ సభ్యుల యాజమాన్య నిధులు బ్యాంకుల్లో గ్యారెంటీగా పెట్టిన వాటికి, క్లయింట్ హోదాలో CM వద్ద జమ చేసిన SB యాజమాన్య నిధులకు ఈ ఫ్రేమ్ వర్క్ వర్తించదు. కానీ బ్రోకర్లు మరియు క్లియరింగ్ సభ్యుల ద్వారా క్లయింట్‌ల నిధులపై జారీ చేయబడిన BGల ప్రస్తుత స్థితిని స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్‌లు గమనించాలని సెబీ పేర్కొంది. ఖాతాదారుల సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొత్త విధానం అమలును పర్యవేక్షించాలని రెగ్యులేటర్ ఆదేశించింది.
ఈ పద్ధతి పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి స్టాక్ బ్రోకర్లు మరియు క్లియరింగ్ మెంబర్స్ నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్లు ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటూ ఉండాలని సెబీ తెలిపింది. బ్రోకర్ పేరు, ఎంటిటీ స్వభావం, మొత్తం బ్యాంక్ గ్యారెంటీ సహా అందులో క్లయింట్ల నిధుల నుంచి ఎంత మొత్తం మరియు యాజమాన్య నిధులు ఏ మేరకు అనే వివరాలను అందించాలని ఎక్స్ఛేంజ్ లను నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి రెండు వారాలకు ఒకసారి చొప్పున ఈ వివరాలతో నివేదిక సమర్పించాలని తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications