SEBI: పెట్టుబడిదారుల కోసం క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు పలు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా మరో నూతన నిబంధన త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జూలై 14 నుంచి అమల్లోకి రానున్న LODR (లిస్టింగ్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) నిబంధనలనూ సెబీ సవరించింది. ఈ చర్యల ద్వారా పూకార్లకు చెక్ పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధాన మీడియాలో వచ్చిన ఏదైనా మార్కెట్ సంబంధిత పుకార్లను ఆయా కంపెనీలు ధృవీకరించడమో, తిరస్కరించడమో స్పష్టం చేయాలని సెబీ ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 100 లిస్టెడ్ కంపెనీలను ముందుగా ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చనున్నట్లు తెలియజేసింది. ఏప్రిల్ 1, 2024 నుంచి టాప్ 250 లిస్టెడ్ ఎంటిటీలకూ ఇది వర్తించనుంది.

లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను బలోపేతం చేసేందుకు, ప్రత్యేక హక్కులను శాశ్వతంగా అనుభవిస్తున్న నిర్దిష్ట వాటాదారుల సమస్యను పరిష్కరించడానికి సెబీ ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఈ తరహా వాటాదారులకు మంజూరు చేయబడిన ప్రత్యేక హక్కు.. సంక్రమించిన తేదీ నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి ప్రత్యేక తీర్మానం ద్వారా సాధారణ సమావేశంలో వాటాదారులు ఆమోదించాల్సి ఉంటుందని తెలిపింది.
బోర్డుకు నియమించబడిన డైరెక్టర్లందరూ కాలానుగుణంగా వాటాదారుల ఆమోద ప్రక్రియకు వెళ్లాలని సెబీ సూచించింది. తద్వారా బోర్డులో సేవలను కొనసాగించడానికి డైరెక్టర్‌కు చట్టబద్ధతను అందించాలని వెల్లడించింది. మార్చి 2024 నాటికి గత ఐదేళ్లలో వాటాదారుల ఆమోదం లేకుండా ఎవరైనా బోర్డులో డైరెక్టర్‌గా పనిచేస్తుంటే, మొదటి సాధారణ సమావేశంలో వారి ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేసింది.
మార్కెట్‌లో లిస్ట్ కాబడిన కంపెనీల సమాచారం, సెక్యూరిటీల బైబ్యాక్ వంటివి బహిర్గతం చేసే సమయాన్ని 24 నుంచి 12 గంటలకు తగ్గించబడింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సైతం మీటింగ్ ముగిసిన 30 నిమిషాల్లోపు వెల్లడించాల్సి ఉంటుంది. కొన్ని కీలకమైన మేనేజర్ పోస్టులకు సంబంధించిన CEO, MD మరియు హోల్ టైమ్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పడిన ఖాళీని మూడు నెలలలోపు భర్తీ చేయాలని సెబీ పేర్కొంది.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications