SIP Investments: చిన్న ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలోనే రూ.250 SIP.. సెబీ చీఫ్ చర్చలు..
Madhabi Puri Buch: ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బం కారణంగా చాలా మంది తమ డబ్బును అధిక రాబడులను ఇచ్చే మార్గాల్లో ఉంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే చాలా ఫండ్స్ మినిమం పెట్టుబడి రూ.500 నుంచి రూ.1000గా ప్రారంభిస్తున్నాయి. అయితే త్వరలోనే స్మాలర్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను చిన్న పొదుపరులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చూస్తోంది. ఇది ఎక్కువ మందిని ప్రోత్సహించటంతో పాటు భవిష్యత్ వృద్ధికి పునాది వేస్తుంది. అలాగే భారతీయ ఈక్విటీ మార్కెట్‌ల మరింత స్థితిస్థాపకతకు పునాది వేస్తాయని సెబీ చైర్‌పర్సన్ మధబి పూరి బుచ్ అన్నారు.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు రూ.250 ఎస్ఐపీని తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నామని, వీటిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఫండ్ హౌస్‌లతో కలిసి సెబీ పనిచేస్తున్నట్లు మాధబి వెల్లడించారు. ఎస్ఐపీ అనేది వాస్తవానికి ఒక రికరింగ్ డిపాజిట్ లాంటిది. ఇక్కడ మీరు ప్రతినెల కొంత మెుత్తం సొమ్మును పెట్టుబడి రూపంలో ఉంచుతారు. ఇది భారీ వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్లకు బదులుగా చిన్న మెుత్తంలో డబ్బును క్రమపద్దతిలో పొదుపు చేసేందుకు దోహదపడుతుంది.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(AMFI) డిసెంబర్ 8న మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన పరిశ్రమల వాణిజ్య సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దేశంలో మెుత్తంగా రూ.49.04 ట్రిలియన్లను అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రూపంలో నిర్వహిస్తోంది. పైగా ఈ నెలలో బెంచ్‌మార్క్ సూచీలు ఆల్ టైమ్ గరిష్టాలను తాకడం ద్వారా ఇది ఊపందుకుంది. వాస్తవానికి చెప్పాలంటే.. కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ఇప్పటికే రూ.100 కంటే తక్కువ SIPలను అందిస్తున్నాయి. అయితే ఆ స్థాయిలో SIPలను అందించడం వారికి ఆచరణీయం కానందున ఇన్వెస్టర్లకు ఎక్కువ ఆప్షన్లను అందించటం లేదు.


Click it and Unblock the Notifications