SEBI News: ఒపప్పుడు భారత బిలియనీర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను అందరూ కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్ అని పిలిచేవారు. అయితే ఆయన కంపెనీల్లో అనేక అవకతవకలు బటయపడిన తర్వాత్ 2016 మార్చిలో దేశం విడిచి పరారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టినట్లు పలు నివేదికలు ఇప్పటికే బయటపెట్టాయి. ప్రస్తుతం ఆయన తన పిల్లలతో కలిసి బ్రిటన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పరారీలో ఉన్న బిలియనీర్ విజయ్ మాల్యాపై భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కఠిన చర్యలు తీసుకుంది. ఆయన దేశాన్ని విడిచిపెట్టిన దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రస్తుత చర్యలు వచ్చాయి. తాజా ఆంక్షల ప్రకారం విజయ్ మాల్యా తప్పుడు లావాదేవీలకు పాల్పడ్డినందున మూడేళ్లపాటు స్టాక్ మార్కెట్లలో ఎటువంటి లావాదేవీలు చేయకుండా నిషేధం విధించినట్లు సెబీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. విదేశీ సంస్థలు, బ్యాంకుల ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి లాభాలు ఆర్జించడం ద్వారా విజయ్ మాల్యా తన కంపెనీల షేర్ల ధరలను పెంచారని సెబీ పేర్కొంది.

మాల్యాపై నిషేధం విధించడంతో పాటు భారతదేశంలోని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో విజయ్ మాల్యా వాటాలను సెబీ స్తంభింపజేసింది. దీనికి తోడు ఇప్పుడు మాల్యా దేశంలోని ఏ లిస్టెడ్ భారతీయ కంపెనీకి డైరెక్టర్‌గా చేరటం కుదరదని సెబీ నిషేధించింది. SEBI నిబంధనల ప్రకారం భారతదేశం వెలుపల నివాసం ఉన్న వ్యక్తులు మాత్రమే FII ద్వారా భారత మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే విజయ్ మాల్యా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది.
విజయ్ మాల్యా రిజిస్టర్డ్ సంస్థల ద్వారా తన పేరు, గుర్తింపును దాచిపెట్టి విదేశీ సంస్థాగత పెట్టుబడులను దుర్వినియోగం చేశారని సెబీ తన విచారణలో గుర్తించింది. జనవరి 2006 నుంచి డిసెంబర్ 2008 వరకు మాల్యా మోసపూరిత లావాదేవీల ద్వారా 5.7 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు సెబీ తన దర్యాప్తులో కనుగొంది.
దేశంలో కింగ్‌ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్‌లో 68 ఏళ్ల విజయ్ మాల్యాకు 8.1 శాతం వాటాను కలిగి ఉన్నారు. అలాగే స్మిర్నాఫ్ వోడ్కా తయారీ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్‌లో 0.01 శాతం వాటాను కలిగి ఉంది. విజయ్ మాల్యా బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్లు బకాయిపడగా వీటిని చెల్లించకుండా 2016 మార్చిలో దేశం విడిడి యూకే వెళ్లిపోయారు. ప్రస్తుతం రూ.180 కోట్ల రుణ ఎగవేత కేసులో విజయ్ మాల్యాపై ప్రత్యేక సీబీఐ కోర్టు జూలై 1న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని పీటీఐ వార్తా కథనం ప్రకారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications