ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌పై సెబీ భారీ జరిమానా.. ఇంతకాలం ఆ రిజిస్ట్రేషన్ లేకుండానే..
Fidelity: క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ.. మార్కెట్లో జరిగే దాదాపు అన్ని అవకతవకలను డేగకన్నుతో పరిశీలిస్తూ ఉంటుంది. ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తెలిస్తే, భారీగా జరిమానాలు విధిస్తుంది. మరికొన్నిసార్లు మార్కెట్ నుంచి బహిష్కరణకు సైతం వెనకాడదు.
ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్(FPI) నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఫిడిలిటీ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్ కంపెనీపై సెబీ చర్యలకు దిగింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ మనీ మేనేజ్‌మెంట్ (FIMM) విషయంలో జరిగిన ఈ పొరపాట్లపై కోటి జరిమానా విధించింది. మెటీరియల్ ఇన్ఫర్మేషన్‌లో మార్పును తెలియజేయడంలో జరిగిన జాప్యం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

FPIగా FIMM నమోదైంది. కాగా దాని అనుబంధ సంస్థ ఫిడిలిటీ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్ కంపెనీ (FMRC)తో FIMM విలీనం చేయబడింది. తద్వారా సొంత FPI రిజిస్ట్రేషన్ లేకుండానే, FIMMకు సంబంధించిన అకౌంట్ వినియోగించి FMRC ట్రేడింగ్ కొనసాగించినట్లు సెబీ గుర్తించింది. ఏడాది 6 నెలల 20 రోజులపాటు FPI లైసెన్స్ లేకుండా 183 బై, 344 సెల్ లావాదేవీలు జరిపినట్లు సెబీ న్యాయాధికారి ఆశా శెట్టి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అందువల్ల మెటీరియల్ సమాచారంలో మార్పును అందించడంలో FMRC విఫలమైంది. నియంత్రణ సంస్థ నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే మీరింది. ఇదే తరహా FPI ఉల్లంఘనలకు సంబంధించి 22.10 లక్షలు జరిమానాను JP మోర్గాన్ చేజ్ సెబీకి చెల్లించి సెటిల్ మెంట్ చేసుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications