Anmol Ambani: అనిల్ అంబానీకి మరో షాక్.. కుమారుడిపై సెబీ కొరఢా, పూర్తి వివరాలు..
Jai Anmol Ambani: చరిత్ర ఊహించని పురోగతితో తిరిగి దివాలా తీసిన వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇటీవల వార్తల్లో నిలిచారు. అయితే కొన్ని వారాల కిందట మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ భారీ పెనాల్టీ విధించటంతో పాటు స్టాక్ మార్కెట్లలో పార్టిసిపేట్ చేయకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ అంబానీకి మరో పెద్ద షాక్ తగిలింది.
వాస్తవానికి అనిల్ అంబానీ కమ్ బ్యాక్ వెనుక అతని కుమారుడు జై అన్మోల్ అంబానీ చాలా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ యువ వ్యాపారవేత్తపై రూ.కోటి పెనాల్టీ విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రుణాల విషయంలో గుర్తించిన అవకతవకల వ్యవహారంలో ఈ యాక్షన్ తీసుకుంది. జై అన్మోల్ మొత్తం జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లెండింగ్, రిలయన్స్ క్యాపిటల్‌తో సహా ఇతర రిలయన్స్ ADAG గ్రూప్ కంపెనీలకు ఈ GPCL సంస్థలు అందించే తదుపరి రుణాలకు సంబంధించి సహేతుకమైన శ్రద్ధ చూపలేదని రెగ్యులేటర్ ఆరోపించింది. ఇదే క్రమంలో రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌పై రెగ్యులేటర్ రూ.15 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఇద్దరిని ఆదేశించినట్లు సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంబానీ తనయుడు వీసా క్యాపిటల్ పార్టనర్‌లకు రూ.20 కోట్లు, అక్యురా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.20 కోట్ల అన్‌సెక్యూర్డ్ లోన్ కోసం ఆమోదం తెలిపినట్లు సెబీ తన దర్యాప్తులో గుర్తించింది. సెబీ ఈ వ్యవహారానికి సంబంధించిన మెయిల్ కాన్వర్జేషన్ గుర్తించింది. దీని ప్రకారం జై అన్మోల్ అంబానీ కంపెనీకి చెందిన రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, అయితే తాను కంపెనీ రెగ్యులర్ కార్యక్రమాల్లో లేనని వెల్లడించటం అంగీకరించబడదని సెబీ పేర్కొంది.
దాదాపు 5 ఏళ్ల కిందట రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి నిధుల మళ్లింపు వ్యవహారంతో 'మోసపూరిత పథకం'లో పాల్గొన్నారని ఆరోపిస్తూ అనిల్ అంబానీని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి సెబీ 5 ఏళ్లు బ్యాన్ చేసింది. ఇదే క్రమంలో అనిల్ అంబానీపై ఏకంగా రూ.25 కోట్లు జరిమానా కూడా విధించింది. ఈ నిషేధ కాలంలో ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ మధ్యవర్తిలో కీలకమైన మేనేజర్ లేదా డైరెక్టర్ పాత్రలను నిర్వహించకుండా ఆదేశించింది. దీనికి తోడు అప్పట్లో కంపెనీకి చెందిన చాలా మంది ఉన్నత స్థాయి అధికారులపై కూడా సెబీ బ్యాన్ విధిస్తూ వారికి కూడా భారీ పెనాల్టీలు విధించింది.


Click it and Unblock the Notifications