Mutual Funds: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్..!
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులెటరీ సంస్థ అయిన సెబీ నవంబర్ 1 నుంచి తమ వెబ్సైట్ల ద్వారా చేసే పెట్టుబడులకు 'డైరెక్ట్' ప్లాన్‌ను డిఫాల్ట్ ఆప్షన్‌గా చేయాలని అన్ని మ్యూచువల్ ఫండ్ హౌస్‌లను ఆదేశించింది. రెగ్యులర్ ప్లాన్లను ఎంచుకునే పెట్టుబడిదారులకు వాటి అధిక వ్యయ నిష్పత్తుల గురించి తప్పనిసరిగా తెలియజేయాలని స్పష్టం చేసింది. తద్వారా డిస్ట్రిబ్యూటర్ ద్వారా పెట్టుబడి పెట్టడంలో అయ్యే అదనపు ఖర్చులను వారు అర్థం చేసుకోగలరని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ఒక కార్యక్రమంలో చెప్పారు. డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లు ఒకే మ్యూచువల్ ఫండ్ పథకంలో రెండు వేర్వేరు ఆప్షన్లుగా ఉంటాయి. రెండూ ఒకే పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెడతాయి. కానీ ఛార్జీలు వేరుగా ఉంటాయి.
డైరెక్ట్ ప్లాన్లను డిస్ట్రిబ్యూటర్ కమీషన్లు లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి కొనుగోలు చేస్తారు. అందువల్ల రెగ్యులర్ ప్లాన్ల కంటే వీటికి తక్కువ వ్యయ నిష్పత్తులు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు తమ వెబ్సైట్లలో రెగ్యులర్ ప్లాన్లను అందించనప్పటికీ, పెట్టుబడిదారులు రెగ్యులర్ ప్లాన్‌కు మారితే అయ్యే ఖర్చుల గురించి వారికి అవగాహన కల్పించాలని సెబీ కోరుకుంటోందని ఒక ప్రముఖ ఫండ్ హౌస్ సీఈఓ త. రెగ్యులర్ ప్లాన్ల ద్వారా జరిగే అన్ని సిప్ లావాదేవీలపై డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించిన కమీషన్‌ను కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్లలో (CAS) తప్పనిసరిగా వెల్లడించాలని కూడా సెబీ ఆదేశించింది.

రెగ్యులర్ ప్లాన్లను డిస్ట్రిబ్యూటర్లు లేదా మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తారు. వీటిలో పంపిణీ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి కాబట్టి, వీటికి అధిక వ్యయ నిష్పత్తులు(అధిక ఛార్జీలు) ఉంటాయి. కమీషన్ ఛార్జీలు తక్కువగా ఉన్నప్పటికీ, 10-12 సంవత్సరాల పెట్టుబడి కాలంలో అవి గణనీయంగా పెరుగుతాయి. ఈ మార్పు పంపిణీదారుల ఆదాయాన్ని పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చని ఆనంద్ రాఠీ వెల్త్ జాయింట్ సీఈఓ ఫెరోజ్ అజీజ్ అన్నారు. ఎందుకంటే ఏఎంసీ వెబ్సైట్ల ద్వారా నేరుగా మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేసే పెట్టుబడిదారులు సాధారణంగా తమంతట తామే (DIY) డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకుంటారని అన్నారు.
ఆర్థిక ప్రణాళిక, ఫండ్ ఎంపిక, పోర్ట్‌ఫోలియో నిర్మాణం, నిరంతర మార్గదర్శకత్వం కోసం పంపిణీదారులపై ఆధారపడే పెట్టుబడిదారులు, వారు అందించే సేవలకు, మద్దతుకు విలువనిస్తారు కాబట్టి, వారి ద్వారానే రెగ్యులర్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ మార్పు పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలిగించడం కంటే పారదర్శకతను మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే ప్రస్తుతం పంపిణీదారులపై ఆధారపడిన పెట్టుబడిదారులు అలానే కొనసాగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఈక్విటీ పథకాలపై 0.50-1.17 శాతం, ELSS (పన్ను ఆదా చేసే) ఫండ్లపై 0.70-1 శాతం, హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లపై 0.50-0.80 శాతం, అలాగే డెట్ ఫండ్లపై 0.20-0.50 శాతం చొప్పున ట్రైల్ కమీషన్లను పొందుతారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications