Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
సుపీరియర్ ఫిన్‌లీస్ లిమిటెడ్ (SFL) షేర్లలో మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడినందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 19 సంస్థలను సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధించింది. చట్టవిరుద్ధంగా రూ. 3.89 కోట్ల లాభాలను సొంతం చేసుకున్న విషయం సెబీ దర్యాప్తు చేసింది. బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లు, వాణిజ్య వివరాలు, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్ లు, ఆడియో కాల్ రికార్డింగ్‌ల ఆధారంగా నిషేధం విధించింది.

సోషల్ మీడియా
SFL షేర్లు మొదట మార్కెట్ ప్లాట్‌ఫారమ్ నుంచి కొనుగోలు చేశారు. తర్వాత టెలిగ్రామ్ ఛానెల్‌లను నిర్వహించే వ్యక్తుల సహాయంతో, SFL షేర్లను కొనుగోలు చేయాలని తప్పుడు ప్రచారం చేయించారు. ఇది నమ్మిన చాలా మంది ఎస్ఎఫ్ఎల్ షేర్లు కొనుగోలు చేశారు. దీంతో స్టాక్ లో పెరుగుదల కనిపించింది. దీంతో వారు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని సెబీ దర్యాప్తులో తేలింది.

టెలిగ్రామ్, వాట్సాప్
"మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్న టెలిగ్రామ్, వాట్సాప్ మొదలైన సోషల్ మీడియా మెసేజింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించడం ద్వారా ఎవరైనా తప్పుడు ప్రచారం చేయడం వల్ల రిటైల్ పెట్టుబడిదారులు నష్టపోతారని సెబీ పేర్కొంది. రెగ్యులేటర్, ప్రైమా ఫేసీ, 14 ఎంటిటీల ఖాతాలకు పెద్ద మొత్తంలో చట్టవిరుద్ధమైన లాభాలు వచ్చినట్లు సెబీ కనుగొంది. మిగిలిన ఐదు ఎంటిటీలు వారి ట్రేడింగ్ ఖాతాలలో చట్టవిరుద్ధమైన లాభాలను పొందేందుకు వీలు కల్పించాయన తెలిపింది.

రూ.3.89 కోట్లు
ఫిబ్రవరి 01, 2021 నుంచి సెప్టెంబర్ 13, 2021 వరకు SFL షేర్ ధరను మార్చడం ద్వారా రూ. 2.13 కోట్ల చట్టవిరుద్ధమైన లాభాలు ఆర్జించాయని పేర్కొంది. సెబీ ఈ సంస్థల నుంచి రూ.3.89 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఆ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి క్రయవిక్రయాలు జరపకూడదని స్పష్టం చేసింది. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయనున్నారు.


Click it and Unblock the Notifications