For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్

|

ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్‌కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఆమోదం తెలిపింది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (RRVL) మధ్య ఒప్పందానికి అమెజాన్ కారణంగా చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు తాజాగా సెబి ఆమోదం తెలిపింది. అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆమోదముద్ర వేసింది. అలాగే అమెజాన్ అభ్యంతరాలపై వివరణ కోరింది.

Budget 2021: వారికి నిర్మలమ్మ ట్యాక్స్ ఫ్రీ పెన్షన్ ఇచ్చేనా?Budget 2021: వారికి నిర్మలమ్మ ట్యాక్స్ ఫ్రీ పెన్షన్ ఇచ్చేనా?

సెబి ఆదేశాలు

సెబి ఆదేశాలు

కీలక ఒప్పందాల సమయంలో ఎలాంటి వివాదం ఉన్నప్పటికీ ముందుగా తనతో పాటు షేర్ హోల్డర్స్‌కు కూడా సమాచారం అందించాలని సెబి తెలిపింది. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకు రావాలని కూడా పేర్కొంది. ఈ ఒప్పందానికి సంబంధించి యాజమాన్యం మార్పులో న్యాయపరంగా చిక్కులు లేకుండా రూట్ మ్యాప్ సమాచారాన్ని కూడా అందించాలని సెబి ఆదేశాలు జారీ చేసింది.

అమెజాన్ ఎంట్రీ

అమెజాన్ ఎంట్రీ

ఆగస్ట్ 29, 2020వ తేదీన ఫ్యూచర్ గ్రూప్ సంస్థలోని వాటాలను రూ.24,713 కోట్లకు RRVL కతొనుగోలు చేసింది. ఈ డీల్‌కు గత ఏడాది నవంబర్‌లో సీసీఐ ఆమోదం లభించింది. ఇప్పుడు సెబి పచ్చజెండా ఊపింది. RRVL-ఫ్యూచర్ డీల్ పైన అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో గత కొద్ది నెలలుగా ఈ డీల్‌కు చిక్కుల్లో పడింది.

రిలయన్స్ షేర్ జంప్

రిలయన్స్ షేర్ జంప్

ఫ్యూచర్ గ్రూప్‌లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉంది. తమకు సమాచారం లేకుండా విక్రయించారని, తమ మధ్య ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపించింది. నష్టపరిహారం డిమాండ్ చేసింది. కానీ నిబంధనల మేరకే ఈ డీల్ కుదిరినట్లు అటు రిలయన్స్, ఇటు ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. ఫ్యూచర్ గ్రూప్‌తో డీల్‌కు సెబి పచ్చజెండా ఊపిన నేపథ్యంలో రిలయన్స్ షేర్ నేడు జంప్ చేసింది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి రిలయన్స్ షేర్ 3.13 శాతం ఎగిసి రూ.2,119 వద్ద ఉంది.

English summary

ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్ | Sebi gives nod to Reliance's acquisition of Future Retail

The Securities and Exchange Board of India (Sebi) has approved Reliance Retail’s acquisition of Future Group’s retail assets on Wednesday.
Story first published: Thursday, January 21, 2021, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X