Co-Location Case: చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈకి మంచిరోజులు తిరిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కోలొకేషన్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళితే స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి పెద్ద ఉపశమనం అందించింది. చాలా కాలంగా దర్యాప్తులో ఉన్న 'కో-లొకేషన్' ఫెసిలిటీ కేసులో ఎన్‌ఎస్‌ఈతో పాటు దాని మాజీ ఉద్యోగుల్లో ఏడుగురిపై రెగ్యులేటరీ ఉల్లంఘనల ఆరోపణలను తగిన సాక్ష్యాధారాలు లేనందున సెబీ తాజాగా కొట్టివేసింది. రెగ్యులేటరీ తీసుకున్న తాజా చర్యలతో మాజీ NSE MDలు చిత్రా రామకృష్ణ, రవి నారాయణ్ ఉపశమనం పొందినవారిలో ఉన్నారు. దీంతో పాటు ఆనంద్ సుబ్రమణియన్, రవీంద్ర ఆప్టే, ఉమేష్ జైన్, మహేశ్ సోపార్కర్, దేవిప్రసాద్ సింగ్‌లపై ఉన్న అభియోగాలు నిరూపితం కాకపోవటం వల్ల సెబీ వారిని నిర్థోషులుగా తేల్చింది.

సెబీ తాజాగా తన 83 పేజీల ఆర్డర్‌లో కేసులో తగినంత మెటీరియల్, సాక్ష్యాలు లేకపోవడం వల్ల కుట్ర లేదా నెక్సస్ నిరూపించబడలేదని పేర్కొంది. 2010-2015 మధ్యకాలంలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్ నుంచి కొంతమంది బ్రోకర్లు ప్రయోజనం పొందారనే విషయం వెలగులోకి రావటంతో సెబీ దర్యాప్తు మెుదలుపెట్టింది. ఈ వివాదం మొదట జనవరి 2015లో విజిల్‌బ్లోయర్ మెయిల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ సిస్టమ్‌లోని లొసుగులను గుర్తించడం ద్వారా ఈ వ్యక్తులు కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్‌లు మిగిలిన మార్కెట్ కంటే ముందుగానే గ్రహించేవారు. 2009 ఆగస్టులో స్టాక్ బ్రోకర్లు కొంత రుసుము చెల్లించటం ద్వారా నేరుగా ఎన్ఎస్ఈ సర్వర్ పక్కనే తమ సర్వర్లను ఏర్పాటు చేసుకునేందుకు కోలొకేషన్ వెసులుబాటును తీసుకొచ్చిన తర్వాత ఇది జరిగింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ తన ఐపీవోను మార్కెట్లోకి ఫ్లోట్ చేయాలని ప్రయత్నిస్తున్న వేళ తాజా ఉపశమనం లభించిందని తెలుస్తోంది. సమాచారం ప్రకారం గత నెల NSE తన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీవో ప్రక్రియను పునఃప్రారంభించింది. దీని కోసం భారత మార్కెట్ రెగ్యులేటర్ అంటే సెబీకి 'నో-అబ్జెక్షన్' కోసం ఎక్స్ఛేంజ్ మళ్లీ దరఖాస్తు చేసింది. భారతదేశపు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE జూన్ త్రైమాసికంలో లాభం 39 శాతం పెరిగి రూ.2,567 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications