ఫిన్‌ఫ్లూయర్స్‌పై సెబీ ఉక్కుపాదం.. ఆ సంస్థకు కోట్లలో ఫైన్.. మార్కెట్ నుంచి బహిష్కరణ
Sebi fine: స్టాక్ మార్కెట్లతో పాటు వాటిలో జరిగే మోసాలను నియంత్రించడంలోనూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూసే కొత్త వారిని ట్రాప్ చేస్తున్న ఫిన్ ఫ్లూయర్స్ పై సెబీ ప్రస్తుతం దృష్టి సారించింది.
బాప్ ఆఫ్ చార్ట్ పేరిట మొహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన సలహాలు ఇస్తూ పెట్టుబడిదారులను మోసం చేస్తున్నట్లు నియంత్రణ సంస్థ సెబీ గుర్తించింది. ఈ అన్ రిజిస్టర్డ్ సంస్థ చట్టవిరుద్ధంగా ఇన్వెస్టర్లకు సేవలు అందిస్తూ బురిడీ కొట్టిస్తుందని గ్రహించింది. దీంతో రంగంలోకి దిగిన సెబీ.. ఈ విధంగా సంపాదించిన 17.20 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని ఆదేశించి షాక్ ఇచ్చింది.

అంతే కాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అతడు సెక్యూరిటీస్ మార్కెట్స్‌ని యాక్సెస్ చేయకుండా నిషేధించింది. 'పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా మోసపూరిత కార్యకలాపాలలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సంపాదించిన అక్రమ నగదును స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చాం' అని సెబీ పేర్కొంది.
కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పెట్టుబడి సలహాలు ఇచ్చినంందుకుగాను 17.20 కోట్లు వారి ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమికంగా గుర్తించామని రెగ్యులేటర్ తన ఆర్డర్స్ లో పేర్కొంది. స్టాక్ మార్కెట్ కోర్సుల పేరిట రుసుములను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో స్వీకరించినట్లు చెప్పింది. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.


Click it and Unblock the Notifications