Market News: పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఎప్పుడూ ముందుంటుంది. మార్కెట్లను డేగ కళ్లతో నిరంతరం కనిపెడుతూనే ఉండుంది. ఎటువంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు రుజువైతే చర్యలకు ఏమాత్రం వెనకాడదు. అవసరమైతే మార్కెట్లపై చెడు ప్రభావం చూపుతున్న పలువురిని ట్రేడింగ్ నుంచి బహిష్కరిస్తూ ఇన్వెస్టర్లకు ధీమా కల్పిస్తూ ఉంటుంది.
రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ పై క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ 10 లక్షల జరిమానా విధించింది. ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ (ఏంజెల్ వన్ లిమిటెడ్) అనేది సెబీ-రిజిస్టర్డ్ స్టాక్ మరియు కమోడిటీ బ్రోకర్.

ఈ సంస్థ BSE మరియు NSE రెండింటిలోనూ లిస్ట్ చేయబడింది. సెబీతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు డిపాజిటరీలు సైతం ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ (ABL) పనితీరుపై సమగ్రంగా సంయుక్త తనిఖీని నిర్వహించాయి. ఆ నివేదిక అనంతరమే చట్టపరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 2019 నుంచి డిసెంబర్ 2020 మధ్య ఏంజెల్ బ్రోకింగ్ పై సెబీ తనిఖీలు నిర్వహించింది. ABL లెడ్జర్‌లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టిందని, 32.97 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం చేసిందని కనుగొన్నట్లు సెబీ తన 78 పేజీల నివేదికలో పేర్కొంది. తనిఖీ వ్యవధిలో 300 సందర్భాలలో నాన్ సెటిల్డ్ ఖాతాదారుల నిధులకు అసలు సెటిల్మెంట్ చేయలేదని గుర్తించినట్లు తెలిపింది. ఈ నాన్-సెటిల్డ్ అమౌంట్ మొత్తం 43.96 లక్షలుగా ఉన్నట్లు గమనించినట్లు వెల్లడించింది.
ABL గత 3 నెలల్లో వ్యాపారం చేయని ఖాతాదారుల ఫండ్‌లను 1,081 సందర్భాలలో అసలు సెటిల్‌మెంట్ చేయలేదు. ఈ మొత్తం 16.65 లక్షలుగా ఉంది. జనవరి 2020 తర్వాత క్యాష్ మార్కెట్ సెగ్మెంట్‌లో సెటిల్‌మెంట్ తేదీ నాడు అమలు చేయబడిన టర్నోవర్ విలువ మేరకు ఫండ్స్ & సెక్యూరిటీల విలువను ABL తనవద్దే ఉంచుకుంది. 85 సార్లు ఇలా జరగ్గా నాన్-సెటిల్డ్ మొత్తం 10.26 లక్షలుగా తేలినట్లు సెబీ వివరించింది. తద్వారా ఏంజెల్ బ్రోకింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లయింది.


Click it and Unblock the Notifications