ICICI Bank News: అదానీ కంపెనీలపై ఇటీవల అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బెర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల లక్షల కోట్ల మేర సదరు గ్రూపునకు నష్టం వాటిల్లింది. అంతటితో ఊరుకోకుండా ఇటీవల సెబీ చీఫ్ మధబి పూరి బుచ్‌పై కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ మరోసారి విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే సెబీ విశ్వసనీయతపై ప్రపంచవ్యాప్తంగా నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఇదే సమయంలో దేశంలోని రెండవ అత్యంత విలువైన బ్యాంక్ ICICI మరియు దాని అనుబంధ సెక్యూరిటీల సంస్థ మెర్జర్‌కి సంబంధించి వివాదం చెలరేగింది. బ్రోకరేజ్ సంస్థ వాటాదారులు కొంతమంది ఈ మెర్జర్ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీ పెట్టుబడిదారులకు నష్టపరిహారం విషయంలో రెగ్యులేటర్ తన స్వంత నిబంధనలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై కలత చెందారు. ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్‌ను డీలిస్ట్ చేయడానికి సెబీ ఎలా అనుమతించిందంటూ ప్రశ్నిస్తున్నారు.

బ్రోకరేజ్‌లో బ్యాంక్ దాదాపు 75 శాతం వాటా కలిగి ఉంది. గతేడాది జూన్‌లో ప్రతి 100 ICICI సెక్యూరిటీలకు బ్యాంక్ 67 షేర్లను అందించడంతో మిగిలిన షేర్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వాటాదురులు తమకు 200 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందంటూ ముంబైలోని కంపెనీ-లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఆగస్టు 21న వారి సవాలును రద్దు చేసి డీల్ కొనసాగించేందుకు ట్రిబ్యునల్ అనుమతించింది. కాగా వారు న్యూ ఢిల్లీలోని మరొక ట్రిబ్యునల్ ముందు ప్రత్యేక క్లాస్-యాక్షన్ దావా వేశారు. ఈ వివాదంపై ముంబైలోని ఉన్నత న్యాయస్థానం కూడా విచారణ జరుపుతోంది.
లిస్టెడ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఎక్స్ఛేంజీల నుంచి ఓ సంస్థను డీ లిస్టింగ్ చేసే వేళ.. రెగ్యులేటర్ మార్గదర్శకాల ప్రకారం సరసమైన ధరను కనుగొనడానికి బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించాలి. అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. టార్గెట్ కంపెనీ కొనుగోలుదారు అనుబంధ సంస్థగా ఉండి, ఒకే రకమైన వ్యాపారంలో ఉన్నప్పుడు రెండు కంపెనీల వాటాదారులకు స్వాప్ నిష్పత్తిని చెప్పి ఓటు వేయమని అడగాలి. కానీ ఇక్కడ ఆ రెండూ ఒకే లైన్ ఆఫ్ బిజినెస్‌లో లేవు కాబట్టి సెబీ నుంచి ICICI మినహాయింపు కోరడంతో ముందుకెళ్లి ఓటింగ్ నిర్వహించింది.
72 శాతం వాటాదారులు అనుకూలంగా ఓటు వేశారు. బ్రోకరేజ్ తన మైనారిటీ పెట్టుబడిదారుల వ్యక్తిగత డేటాను బ్యాంక్‌తో పంచుకోవడంతో ICICI ఉద్యోగులు వారిని సంప్రదించారు. లావాదేవీకి సంబంధించి వివరించి ఇ-ఓటింగ్‌లో పార్టిసిపేషన్ పెంచడం దాని ఉద్దేశ్యంగా ఉంది. కానీ డేటాను పంచుకోవడం నిబంధనలకు విరుద్ధం కావడంతో రెగ్యులేటర్ ICICIకు వార్నింగ్ ఇచ్చింది. అయితే ICICI సెక్యూరిటీస్ మరియు బ్యాంక్ విలీన నిబంధనలను స్వతంత్ర వాల్యుయేషన్ నిపుణులు నిర్ణయించారని, పలు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థల ద్వారా సరసమైన ధర గుర్తించబడినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications