Madhabi Puri Buch: కరోనా తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారితో పాటు ట్రేడర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. వాస్తవానికి దీనిపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ నిర్వహించే రిటైల్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు సెబీ నివేదించింది.
ఈ క్రమంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వీటిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. సెబీ ప్రతిపాదించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చర్యలు అమలైతే స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్ఈలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని తెలుస్తోంది. సెబీ నిర్ణయాలతో రానున్న కాలంలో మార్కెట్ వాల్యూమ్‌లు 30-40 శాతం పడిపోయే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అలాగే ఇన్వెస్టర్ హెడ్‌కౌంట్‌లో తగ్గుదల పరంగా పెద్ద హిట్ అన్నారు. ఇది డిస్కౌంట్ బ్రోకర్లు ఎక్కువ ప్రమాదంలో పడతారని తెలిపింది.

డెరివేటివ్‌లలో రిటైల్ స్పెక్యులేషన్‌ను అరికట్టడానికి సెబీ ప్రతి ఎక్స్ఛేంజ్‌కు ఒకే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను మాత్రమే ఉంచాలని ప్రతిపాదించింది. ఇదే అమలులోకి వస్తే మొత్తం వాల్యూమ్‌లలో 98 శాతంగా ఉన్న ఇండెక్స్ ఆప్షన్ కాంట్రాక్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. అలాగే కాంట్రాక్ట్ పరిమాణాన్ని 2-3 రెట్టుల పెంచటం మార్కెట్లోకి వస్తున్న అనేక మంది రిటైల్ ఇన్వస్టర్లను అడ్డుకుంటుందని బ్రోకరేజ్ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఎన్ఎస్ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి 60 శాతం ఆదాయాన్ని పొందుతుండగా, బీఎస్ఈలో 40 శాతం ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇవి భారీగా క్షీణించటం ఆర్థికంగా ఎక్స్ఛేంజీలకు నష్టం కలిగించనుంది.
రిటైలర్ల నష్టాలపై సెబీ చీఫ్ కామెంట్స్:
భారత స్టాక్ మార్కెట్‌లోని పెట్టుబడిదారులు ఏడాదిగా డెరివేటివ్ ట్రేడ్‌లలో సుమారు రూ.60,000 కోట్లను నష్టపోయారని ఎన్‌ఎస్‌ఈ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ వెల్లడించారు. చిన్న ఇన్వెస్టర్లు తమ గృహాల పొదుపు నుంచి ఫ్యూచర్స్ & ఆప్షన్స్ వల్ల ఏడాదికి రూ.50-60 వేల కోట్లు పోగొట్టుకోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డబ్బును రాబోయే ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా ఆర్థిక వ్యవస్థలో వినియోగించుకోవచ్చన్నారు.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో పెరుగుతున్న డీల్స్ పై సెబీ చీఫ్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి 10 మంది ఆప్షన్ ట్రేడర్లలో 9 మంది నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకే F&O ట్రేడింగ్ పై పరిమితులను కఠినతరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. F&O ఒప్పందాల సెటిల్‌మెంట్ రోజున క్యాలెండర్ స్ప్రెడ్ ప్రాఫిట్‌ను తొలగించడం, ప్రతిపాదిత కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ మార్జిన్‌ను పెంచడం వంటి చర్యలను సెబీ తాజాగా తన సంప్రదింపుల పత్రంలో చేర్చింది.


Click it and Unblock the Notifications