Mutual funds: మ్యూచువల్ ఫండ్స్ నామినీ ఎంపికపై సెబీ లేటెస్ట్ అప్‌డేట్.. ఇదీ కొత్త గడువు తేదీ..
Mutual funds: ఈమధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్టర్ల సంపద వారి తదనంతరం ఎవరికి చెందాలో నిర్ణయించుకునేందుకు నామినీని ఎంచుకోవడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. ఈ గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుండగా.. తాజాగా మరో ప్రకటన చేసింది.
పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. నామినీ ఎడిషన్ పై మరోసారి స్పందించింది. గడువు తేదీలోగా నామినీని ఎంచుకోలేని వారికి మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది చివరిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల మరింత మంది లబ్ధి పొందుతారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

తమ కుటుంబీకులు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని వారి అనంతరం చట్టబద్ధ వారసులకు ఆ మొత్తం అందే విధంగా సెబీ గతంలోనే చర్యలు మెదలుపెట్టింది. ఇందుకుగాను నామినీని యాడ్ చేయడం తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో నామినీ ఎంపిక నుంచి వైదొలగడానికీ అవకాశం కల్పించింది. అయితే గడువు తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఫోలియోలను స్తంభింప చేస్తామని సైతం హెచ్చరించింది.
అంతటితో ఆగని సెబీ.. పెట్టుబడిదారులను అప్రమత్తం చేసేందుకు 15 రోజులకు ఒకసారి రిమైండర్ మెయిల్స్, మెసేజ్లు పంపించాలని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను కోరింది. తద్వారా ఈ నామినేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తిగా విజయవంతం చేయాలని భావిస్తోంది. అందుకే తమ పరిధిలోని ఇన్వెస్టర్స్.. నామినీ ఎంపిక పూర్తిచేయడం లేదా వైదొలగడం తప్పనిసరి చేసేలా AMCలపై ఒత్తిడి తీసుకొస్తోంది.


Click it and Unblock the Notifications