AI News: ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంట పరుగెడుతోంది. మెల్లమెల్లగా సాంప్రదాయ పద్ధతులను వదిలి పలు సంస్థలు AI వినియోగాన్ని మొదలుపెట్టాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే పన్ను ఎగవేతదారుల ఆటకట్టిస్తోంది. కాగా ఇప్పుడు సెబీ కూడా ఈ జాబితాలో చేరింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తన పరిశోధనల కోసం కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తోందని మార్కెట్ రెగ్యులేటర్ కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. మార్కెట్ పారదర్శకంగా ఉన్నంత వరకు మరియు ఎటువంటి అవకతవకలు జరగనంత వరకు బాగానే ఉంటుందన్నారు. అయితే ఈ తరహా ఇబ్బందులు తలెత్తే మందే వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్కెట్లలో జరుగుతున్న అన్ని సాంకేతిక పరిణామాలను సంస్థ తప్పనిసరిగా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని సెబీ యొక్క పూర్తి కాల సభ్యులు కమలేష్ చంద్ర వర్ష్నే అభిప్రాయపడ్డారు. చట్టానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విషయంలో AI వినియోగం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని, ఉల్లంఘనలు సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తుందని అంచనా వేశారు.
అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా 13వ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పరిశోధనల కోసం AIని ఉపయోగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విషయాల్లోనూ ఈ సాంకేతికత విరివిగా వినియోగించుకోనున్నట్లు చెప్పారు. దీన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలని మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడే బ్రోకర్లను హెచ్చరించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications