ఐపీవో తర్వాత... సెబి కీలక నిర్ణయం, ప్రమోటర్ల లాక్-ఇన్ పీరియడ్ తగ్గింపు

ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) తర్వాత ప్రమోటర్లు తమ పెట్టుబడిని కొన్ని షరతులకు లోబడి కనీసం పద్దెనిమిది నెలల పాటు ఉంచితే సరిపోతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తెలిపింది. అంటే లాక్-ఇన్-పీరియడ్ సమయాన్ని పద్దెనిమిది నెలలకు కుదించింది. గతంలో ఇది మూడేళ్లుగా ఉంది. ఇటీవల చాలా కంపెనీలు ఐపీవోకు వ్తున్నాయి. ఈ నేపథ్యంలో సెబి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫర్ ఫర్ సేల్ కోసం లేదా ఇతర ప్రాజెక్టుకు మూలధన వ్యయం మినహా ఇతరత్రా అవసరాలకు నిధులు అందించే ఉద్దేశంతో ఇష్యూకు వచ్చినప్పుడు, ప్రమోటర్లు తమ కనీస 20 శాతం పెట్టుబడిని ఐపీఓలో షేర్ల కేటాయింపు తేదీ నుండి 18 నెలలు ఉంచాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఒకవేళ కనీస పెట్టుబడి పరిమితి అయిన 20 శాతానికి మించి ప్రమోటర్లు వాటా కలిగి ఉంటే లాక్-ఇన్-పీరియడ్‌ను ప్రస్తుతం ఉన్న సంవత్సరం కాలం నుండి ఆరు నెలలకు తగ్గించింది. ప్రమోటర్లు కాకుండా ఐపీఓకు ముందు షేర్లను కలిగి ఉన్న వాటాదారులకు లాక్-ఇన్-పీరియడ్‌ను కూడా, షేర్ల కేటాయింపు తేదీ నుండి ఆరు నెలలకు కుదించింది. ప్రస్తుతం ఇది ఏడాదిగా ఉంది. ఈ నెల ప్రారంభంలో పై ప్రతిపాదనలు సహా మరిన్నింటికి సెబి బోర్డు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయాలు తీసుకుంది.

IPO సమయంలో గ్రూప్ కంపెనీలకు సంబంధించి వెల్లడించాల్సిన నిబంధనలను కూడా సెబి సడలించింది. పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీ తన గ్రూప్ కంపెనీల్లో అత్యుత్తమ ఐదు లిస్టెడ్ లేదా నమోదు కాని సంస్థల ఆర్థిక వివరాలను ఐపీవో దరఖాస్తులో తెలియజేయడం నుండి సెబి మినహాయింపు ఇచ్చింది. ఇవి గ్రూప్ కంపెనీల వెబ్ సైట్‌లో ఉంచితే సరిపోతుంది. ప్రభుత్వ సంస్థ లేదా చట్టబద్ద సంస్థ లేదా కార్పోరేషన్ లేదా SPV మినహా ఇతర సంస్థలు తమ గ్రూప్ కంపెనీల పేర్లు, వాటి రిజిస్టర్డ్ ఆఫీస్‌ల చిరునామాలను ఐపీవో దరఖాస్తులో పొందుపరచాలి. ఈ మేరకు సెబి తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇందుకు ICDR నిబంధనలను సెబి సవరించింది. కంపెనీ కొనుగోలుదారులు, ప్రమోటర్లకు సంబంధించి తప్పక వెల్లడించవలసిన నిబంధనల నుండి కొన్నింటిని తొలగించడంతో పాటు టేకోవర్ నిబంధనలను సవరించింది.

Sebi cuts lock in period for promoters to 18 months post IPO

కార్పోరేట్ గవర్నెన్స్, డిస్‌క్లోజర్లను పటిష్టపరిచే దిశగా కొత్త నిబంధనలు నోటిఫై చేసింది సెబి. ఈ నిబంధనలలో భాగంగా టాప్ వెయ్యి లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్ పంపిణీ విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా టాప్ 500 కంపెనీలకు ఇది తప్పనిసరి. దీనిని వెయ్యికి పెంచుతూ సెబి నిబంధనలు సవరించింది. ఇతర లిస్టెడ్ కంపెనీలు వాటి డివిడెండ్ పంపిణీ విధానాన్ని స్వచ్ఛందంగా వాటి వెబ్‌సైట్లలో ప్రకటించవచ్చు. అలాగే రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీల ఏర్పాటును టాప్ వెయ్యి కంపెనీలకు తప్పనిసరి. కమిటీల్లో ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్‌తో సహా కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ పాలసీని రూపొందించడం, దాని అమలును పర్యవేక్షించడం, సమీక్షించడం ఈ కమిటీ పని. మార్చి 31నాటి మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్ కంపెనీలను నిర్ధారిస్తారు.

IGP ప్లాట్ ఫామ్ పైన నమోదైన కొత్త టెక్నాలజీ కంపెనీలు జారీ చేసే స్వేట్ ఈక్విటీ నిబంధనలను సడలించింది సెబి. ఏడాదికి పదిహేను శాతం వరకు స్వెట్ ఈక్విటీలను ఈ కంపెనీలు జారీ చేయవచ్చు. స్వెట్ ఈక్విటీ పరిమితి ఏ సమయంలో అయినా చెల్లించిన మూలధనంలో 50 శాతానికి మించకూడదని సెబి పేర్కొంది. నగదుకు బదులు కాకుండా ఉద్యోగులకు ఇచ్చే షేర్లను స్వెట్ ఈక్విటీగా పరిగణిస్తారు. ఈ పొడిగించిన షేర్ల జారీ పరిమితి, కంపెనీ వ్యవస్థాపితమైన తేదీ నుండి పదేళ్ల కాలానికి వర్తిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+