SEBI on Finfluencers: దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ప్రజలకు మక్కువ పెరగటాన్ని చాలా మంది ఫిన్‍ఫ్లూయెన్సర్లు క్యాష్ చేసుకుంటున్నారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను ప్రభావితం చేస్తూ ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఏ స్టాక్ ఎప్పుడు కొనాలి అనే టిప్స్ అందించే సంస్థలు లేదా వ్యక్తులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చాలా సీరియస్‍గా ఉంది. ఇలాంటివారిపై సెబీ కఠినంగా వ్యవహరించటంతో పాటు పెనాల్టీలు కూడా విధిస్తోంది.
ఈ క్రమంలోనే ఫిన్‌ఫ్లూయెన్సర్‌లపై అణిచివేతను సెబీ తీవ్రతరం చేసింది. తాజాగా 'బాప్ ఆఫ్ చార్ట్' పేరుతో అనధికారిక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సేవలను నిర్వహిస్తూ ప్రజలకు స్టాక్స్ కొనుగోలు సూచనలు అందిస్తున్న మొహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ అనే ఫిన్‌ఫ్లూయెన్సర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ఇదే క్రమంలో సెబీ మరో ఏడు సంస్థలపై కూడా నిషేధాన్ని విధించింది. వాస్తవానికి నసీరుద్దీన్ అన్సారీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ వేదికగా 'బాప్ ఆఫ్ చార్ట్' పేరుతో ప్రొఫైల్‌ను నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా పెట్టుబడిదారులుకు స్టాక్ కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించిన సిఫార్సులను అందించేవాడు.

ఫిన్‌ఫ్లూయెన్సర్లపై అణచివేతను కొనసాగిస్తున్న రెగ్యులేటరీ సంస్థ రానున్న మూడు నెలల్లోగా రూ.17.2 కోట్లను రీఫండ్ చేయాలని నసీరుద్దీన్ అన్సారీ, రాహుల్ రావు పడమటి, తబ్రైజ్ అబ్దుల్లా, ఆసిఫ్ ఇక్బాల్ వానీ, గోల్డెన్ సిండికేట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మన్షా అబ్దుల్లా, జాదవ్ వంశీ సంస్థలను ఆదేశించింది. సదరు సంస్థలు లేదా వ్యక్తులు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి ప్రజలకు జ్ఞానాన్ని అందిస్తున్నట్లు నటిస్తూ వారికి స్టాక్ రికమండేషన్స్ అందిస్తున్నాయని సెబీ గుర్తించింది. ఇదే క్రమంలో రెగ్యులేటరీ అన్సీరీపై రూ.20 లక్షలు జరిమానా కూడా విధించింది. ఇక మిగిలిన వ్యక్తులకు ఒక్కొక్కరిపై రూ.2 లక్షల చొప్పున జరిమానాను కూడా విధించింది. సెబీ వద్ద రిజిస్టర్ కానీ స్టాక్ అడ్వైజర్లు ఇన్వెస్టర్లను తప్పుదారిపట్టించే ప్రమాదం ఉందని సెబీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక్కడ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా నసీర్ నష్టాలను చవిచూశాడని, అయినప్పటికీ ట్రేడింగ్ వ్యూహాలను ఉపయోగించి అవాస్తవిక హామీ రాబడుల గురించి తప్పుడు వాగ్దానాలతో ఇన్వెస్టర్లను ఆకట్టుకునేవాడని సెబీ ఫుల్ టైం మెంబర్ అమర్జీత్ సింగ్ పేర్కొన్నారు. బాప్ ఆఫ్ చార్ట్ ద్వారా అందించే "ఎడ్యుకేషనల్ కోర్సులను" కొనుగోలు చేయడానికి క్లయింట్‌లను ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో అన్సారీ రిటర్న్‌లకు హామీ ఇస్తున్నారని సెబీ గుర్తించింది.
బుద్ది మార్చుకోని బ్రోకరేజీలు..
అధిక సంఖ్యలో క్లయింట్లను పొందటం కోసం బ్రోకరేజీలు సెబీ వద్ద రిజిస్టర్ కాని ఫిన్‌ఫ్లూయెన్సర్లను వినియోగించటం అందుకోసం వారికి రిఫరల్ బోనస్ ఇవ్వటాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే బ్రోకరేజ్ సంస్థలు మాత్రం చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగిస్తూ వారికి రిఫరల్ ఫీజులను చెల్లిస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలు ఇప్పుడు బ్రోకరేజీలు తమ పుస్తకాల్లో వివిధ వినూత్న పేర్లతో నమోదవుతున్నాయని, రిఫరల్ ఫీజుగా పేర్కొనడం లేదని విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా బయటపడింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications