SEBI: ఏమైనా చెయ్యి డబ్బు సంపాదించు అన్న ధోరణి ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. అవతలి వాడిని మోసం చేసైనా సరే షావుకారులా బతకటం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.
ఈజీ మనీకోసం కొందరు స్టాక్ మార్కెట్ల బాట పడుతున్నారు. దీనిని కొందరు ఫిన్‌ఫ్లుయన్సర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ట్రేడింగ్ గురించి నేర్పిస్తామని.. లైవ్ ట్రేడింగ్ టిప్స్ అందిస్తామంటూ ఊదరకొడుతూ జనం జోబులకు జ్ఞానం పేరుతో చిల్లు వేస్తున్నారు. ప్రస్తుతం వీరిపైనే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చాలా సీరియస్ గా ఉంది. తాజాగా ఈ కోవకు చెందిన పెట్టుబడి సలహదారు Baap of Chart బండారం బయట పడింది.

మెుహమద్ నజీరుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి బాప్ ఆప్ చార్ట్ పేరుతో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడి సలహాలను ప్రజలకు అందిస్తోంది. ప్రతినెల రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు లాభాలను అందిస్తామంటూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ ఆన్ లైన్ కోర్సులను అమ్ముతోంది. దీనికి తోడు నజీర్ లైవ్ మార్కెట్ ట్రాన్సాక్షన్లతో వారికి సపోర్ట్ అందిస్తుండేవాడు. వారి వెబ్ సైట్, యాప్ నిర్వహణను సెబీ క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
నజీర్ తనకు భారీగా లాభాలు వస్తున్నాయంటూ పెట్టుబడిదారులను నమ్మిస్తున్నట్లు సెబీ గుర్తించింది. అలా అన్సారీ అండ్ గ్రూప్ కోర్సుల పేరుతో ప్రజల నుంచి రూ.17.2 కోట్లను లాగేశారు. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ట్రేడర్లకు లాభాలు ఎలా పొందాలో నేర్పిస్తామంటూ కోర్సులు అమ్ముతున్న బాప్ ఆఫ్ చార్ట్ వాస్తవానికి ట్రేడింగ్‌లో జనవరి 2021 నుంచి జూలై 2023 మధ్య కాలంలో ఏకంగా రూ.3 కోట్ల మేర నష్టపోయినట్లు సెబీ గుర్తించింది. పెద్ద లాభాలు ఎలా పొందాలో నేర్పిస్తామంటూ నష్టాలను దాచిపెట్టారు.
దీంతో సెబీ మెుహమద్ నజీరుద్దీన్ అన్సారీతో పాటు అతని సంస్థను స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నుంచి నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో కోర్సుల పేరుతో వసూలు చేసిన మెుత్తం రూ.17.2 కోట్లను ఒక ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. చాలా మంది ఆల్గో ట్రేడర్లు మార్కెట్లో ప్రస్తుతం సెబీ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ లాభాలను ఆశ చూపుతూ ప్రజలకు తమ ట్రేడింగ్ సాఫ్ట్ వేర్లు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి గణాంకాలను పరిశీలిస్తే ప్రతి 10 మంది ట్రేడర్లలో 9 మంది నష్టాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి వారి మాటలకు మోసపోవద్దని సెబీ పెట్టుబడిదారులను హెచ్చరిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications